ఓ పెళ్లి ఖర్చు రూ. 6,800 కోట్లు | Russian billionaire splashes out on son's lavish wedding | Sakshi
Sakshi News home page

ఓ పెళ్లి ఖర్చు రూ. 6,800 కోట్లు

Mar 30 2016 4:06 PM | Updated on Sep 3 2017 8:53 PM

ఓ పెళ్లి ఖర్చు రూ. 6,800 కోట్లు

ఓ పెళ్లి ఖర్చు రూ. 6,800 కోట్లు

ఎవరైనా విలాసవంతంగా వివాహం జరిపిస్తే ఆకాశమంత పందిరివేసి, భూదేవంత పీట వేసి అంగరంగ వైభవంగా చేశాడంటాం అతిశయోక్తిగా.

మాస్కో: ఎవరైనా విలాసవంతంగా వివాహం జరిపిస్తే ఆకాశమంత పందిరివేసి, భూదేవంత పీట వేసి అంగరంగ వైభవంగా చేశాడంటాం అతిశయోక్తిగా. అదే తరహాలో కజక్‌లో పుట్టి రష్యాలో ప్రపంచ చమురు, మీడియా దిగ్గజంగా ఎదిగిన మిహాయిల్ గుత్సరీవ్ తన 28 కుమారుడి పెళ్లిని అంతకంటే వైభవోపేతంగా జరిపించారు.
 

 మాస్కోలోని లగ్జరీ రెస్టారెంట్, సఫియా బాంక్వెట్ హాల్లో పుష్పాలంకృత భారీ వేదికపై శనివారం జరిగిన ఈ పెళ్లికి 6,800 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయన్నది ఓ అంచనా. వజ్రాలు పొదిగిన పెళ్లి కూతురు శ్వేతవర్ణపు వెడ్డింగ్ డ్రెస్‌కే 16.20 లక్షల రూపాయలట. ప్రముఖ డిజైనర్ నేసిన దీన్ని పారిస్ నుంచి తెప్పించారు.
 

 వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో 28 ఏళ్ల గుత్సరీవ్, 20 ఏళ్ల విద్యార్థి ఖదీజా ఉజకోవ్‌లు పెళ్లి చేసుకున్నారు. జెన్నీఫర్ లోపెజ్, ఎన్రిగ్ ఇగ్లేసియాస్ లాంటి సెలబ్రిటీలు ఆహుతులను అలరించారు. ఇంతవైభవంగా పెళ్లి జరిపించిన చమురు దిగ్గజం మిహాయిల్‌కు 38 వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement