స్పీడందుకున్న ఎస్కలేటర్‌.. 20 మందికి గాయాలు

In Rome Escalator Malfunction Cause 20 Injured - Sakshi

రోమ్‌ : నిర్దేశిత వేగం కంటే ఎక్కువ స్పీడ్‌తో ప్రయాణించిన ఓ ఎస్కలేటర్‌ 20మందిని గాయలపాలు చేసింది. ఈ ఘటన ఇటలీలోని రిపబ్లికన్‌ మెట్రో స్టేషన్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూసేందుకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిర్దేశిత వేగంతో కదులుతున్న ఎస్కలేటర్ ఆకస్మాత్తుగా ఒవర్‌ స్పీడ్‌ అందుకుంది. దాంతో దానిపై ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డారు. ఫలితంగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు.

బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక మెట్రో అధికారులు విచారణ చేపట్టారు. ఓ అధికారి మాట్లాడుతూ ‘ప్రమాదం జరగటానికి కాసేపటి క్రితం మద్యం సేవించిన కొందరు యువకులు ఎస్కలేటర్‌పై గంతులు వేశారని.. అందుకే అది అదుపు తప్పి ఉండొచ్చని భావిస్తున్నట్లు’​ వెల్లడించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top