స్పేస్‌ఎక్స్ డ్రాగన్ తిరిగొచ్చింది | Return to Dragon speseks | Sakshi
Sakshi News home page

స్పేస్‌ఎక్స్ డ్రాగన్ తిరిగొచ్చింది

Oct 27 2014 3:34 AM | Updated on Aug 24 2018 8:18 PM

స్పేస్‌ఎక్స్ డ్రాగన్ తిరిగొచ్చింది - Sakshi

స్పేస్‌ఎక్స్ డ్రాగన్ తిరిగొచ్చింది

భూమి చుట్టూ తిరుగుతున్న సంచార ప్రయోగశాల ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)’కు పరికరాలు,...

వాషింగ్టన్: భూమి చుట్టూ తిరుగుతున్న సంచార ప్రయోగశాల ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)’కు పరికరాలు, నమూనాలు తీసుకెళ్లిన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక శనివారం మెక్సికో తీరం వద్ద పసిఫిక్ సముద్రంపై  సురక్షితంగా దిగింది. ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాములు జరిపిన కీలక ప్రయోగాల తాలూకు ఫలితాలను వెల్లడించే శాస్త్రీయ నమూనాలు, ఇతర పరికరాలను స్పేస్‌ఎక్స్ భూమికి తీసుకొచ్చింది.

నాసాతో కాంట్రాక్టు మేరకు అమెరికన్ కంపెనీ స్పేస్‌ఎక్స్ ఈ వ్యోమనౌకను ఐఎస్‌ఎస్‌కు పంపింది. సెప్టెంబరు 21న నింగికి వెళ్లిన ఈ నౌక.. ఐఎస్‌ఎస్‌లో 255 పరిశోధనలు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలను తీసుకెళ్లింది. శనివారం ఐఎస్‌ఎస్ నుంచి విడిపోయి ఐదున్నర గంటలపాటు ప్రయాణించి సముద్రంపై దిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement