ప్రాణాలు పణంగా! | refugees troubles in morocco | Sakshi
Sakshi News home page

ప్రాణాలు పణంగా!

Feb 14 2016 9:59 AM | Updated on Sep 3 2017 5:39 PM

ప్రాణాలు పణంగా!

ప్రాణాలు పణంగా!

ఎలాగోలా యూరోప్‌లోకి అడుగుపెట్టాలని శరణార్థులు ప్రాణాలను పణంగా పెట్టి సముద్రాన్ని దాటుతుంటారు.

ఎలాగోలా యూరోప్‌లోకి అడుగుపెట్టాలని శరణార్థులు ప్రాణాలను పణంగా పెట్టి సముద్రాన్ని దాటుతుంటారు. ఎందరో ప్రాణాలు కోల్పోతుంటారు కూడా. అదృష్టవశాత్తు అవతలి ఒడ్డు చేరితే శరణార్థి శిబిరాల్లో తలదాచుకొని... శరణార్థిగా గుర్తింపు పొందడానికి దరఖాస్తు చేసుకొని... అది లభించేదాకా నెలల తరబడి వేచిచూడాలి. ఏదోరకంగా యూరోప్‌లో అడుగుపెట్టాలన్న వీరి ఆరాటాన్ని సొమ్ము చేసుకుంటున్న స్మగ్లర్లు పోలీసులకు చిక్కకుండా వివిధ మార్గాల్లో వీరిని సరిహద్దులు దాటిస్తున్నారు.         

మొరాకో నుంచి స్పెయిన్‌లోకి ప్రవేశించడానికి కొందరు శరణార్థులు చేసిన సాహసమే ఈ చిత్రాలు. ఒకతను కారు వెనకవైపు బంపర్ కింద తాళ్లు కట్టుకొని వేలాడితే... మరొకతను డ్రైవర్ పక్కనున్న సీటును తొలగించి... అచ్చు కుర్చీలా తాను కూర్చొని పైనుంచి లెదర్ సీట్ కవర్స్ వేసుకున్నాడు. తనిఖీలో చిక్కిన వీరి చిత్రాలను స్పెయిన్ విడుదల చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement