స్కాట్లాండ్‌ స్వాతంత్య్రంపై రెఫరెండం! | Referendum on Scotland independence | Sakshi
Sakshi News home page

స్కాట్లాండ్‌ స్వాతంత్య్రంపై రెఫరెండం!

Mar 14 2017 3:27 AM | Updated on Jul 11 2019 8:00 PM

స్కాట్లాండ్‌ స్వాతంత్య్రంపై రెఫరెండం! - Sakshi

స్కాట్లాండ్‌ స్వాతంత్య్రంపై రెఫరెండం!

బ్రెగ్జిట్‌ (ఐరోపా దేశాల కూటమి నుంచి బ్రిటన్‌ వైదొలగడం) నేపథ్యంలో స్కాట్లాండ్‌ ప్రయోజనాలను బ్రిటన్‌

లండన్‌: బ్రెగ్జిట్‌ (ఐరోపా దేశాల కూటమి నుంచి బ్రిటన్‌ వైదొలగడం) నేపథ్యంలో స్కాట్లాండ్‌ ప్రయోజనాలను బ్రిటన్‌ పట్టించుకోవడం లేదనీ, కాబట్టి యూకే నుంచి స్కాట్లాండ్‌కు స్వాతంత్య్రం కోసం ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం)కు పార్లమెంటు అనుమతి కోరతానని స్కాట్లాండ్‌ అధ్యక్షురాలు (ఫస్ట్‌ మినిస్టర్‌) నికోలా స్టర్జన్‌ సోమవారం అన్నారు.

2014లోనే స్కాట్లాండ్‌కు స్వాతంత్య్రంపై రెఫరెండం పెట్టగా అక్కడి ప్రజలు యూకేతో కలిసి ఉండటానికే ఓటు వేయడం తెలిసిందే. ‘యూకేతోపాటు స్కాట్లాండ్‌ కూడా ఐరోపా కూటమి నుంచి బయటకు రావాలా? స్వత్రంత్ర దేశంగా ఉండి అటు యూకేతోనూ, ఇటు కూటమితోనూ సంబంధాలను నెరపాలా? అనే రెండు ఎంపికలు ప్రజలకు ఉండేలా చర్యలు తీసుకుంటా’అని స్టర్జన్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement