ఖతార్‌కు దెబ్బపై దెబ్బ | Qatar row: Saudi revokes Qatar Airways' licence | Sakshi
Sakshi News home page

ఖతార్‌కు దెబ్బపై దెబ్బ

Jun 7 2017 12:54 AM | Updated on Sep 5 2017 12:57 PM

ఖతార్‌కు దెబ్బపై దెబ్బ

ఖతార్‌కు దెబ్బపై దెబ్బ

ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన కార్యాలయాలన్నింటిని 48 గంటల పాటు మూసేయాలని సౌదీ అరేబియా జనరల్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆదేశాలు జారీ చేసింది.

ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన కార్యాలయాలన్నింటిని 48 గంటల పాటు మూసేయాలని సౌదీ అరేబియా జనరల్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఖతార్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులకు జారీ చేసిన లైసెన్స్‌లను ఉపసంహరించుకోనున్నట్లు వెల్లడించింది.

ఇప్పటికే ఖతార్‌ నుంచి రాకపోకలను సౌదీ నిషేధించింది. సాదీ తాజా నిర్ణయంతో ఖతార్‌కు మరో షాక్‌ తగిలింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనే ఆరోపణలపై ఖతార్‌తో దౌత్యపరమైన సంబంధాలను ఉపసంహరించుకుంటున్నట్లు బహ్రెయిన్‌, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్‌, లిబియా, మాల్దీవులు పేర్కొన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement