ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ ఉండే బంగ్లా ఇదే!

Prince Harry and Meghan Markle stayed at a Canadian mansion - Sakshi

బ్రిటీష్‌ రాచరిక కుటుంబం జీవితం నుంచి విడిపోయి తాము స్వతంత్రంగా బతకాలని నిర్ణయించుకున్నట్లు ప్రిన్స్‌ హ్యారీ, ఆయన భార్య  మేఘన్‌ మార్కే ప్రకటించి సంచలనం సష్టించిన విషయం తెల్సిందే. హ్యారీ దంపతులు తమ కుమారుడితో కలిసి క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను బ్రిటీష్‌ కొలంబియాలోని విక్టోరియాలో నీటి ఒడ్డునున్న ప్యాలెస్‌ లాంటి బంగ్లాలో గడిపారు. ఇక ముందు జీవితం ఆ బంగ్లాలోనే గడపాలని నిర్ణయించుకున్నట్లు తెల్సింది. 

దాదాపు 18 మిలియన్‌ డాలర్లు విలువచేసే ఆ బంగ్లాను వారు రష్యాకు చెందిన ఓ బిలియనీర్‌ నుంచి కొనుగోలు చేసినట్లు తెల్సింది. ఈ విషయాన్ని ధ్రువీకరించడానికి హ్యారీ దంపతులు, వారి ప్రతినిధి నిరాకరించారు. ఆ రష్యా వ్యాపారి కంట్రీ క్లబ్‌లో షేర్‌ హోల్డర్‌ అవడం వల్ల కంట్రీ క్లబ్‌ పేరుతో ఆ భవనాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో కొత్త చట్టం ప్రకారం ఆస్తులు అమ్మినప్పుడు కచ్చితంగా దాని వెల ఎంతో ప్రకటించి అంత మొత్తానికి పన్ను చెల్లించాలి. ఆ పన్నును తప్పించుకునేందుకే రష్యా వ్యాపారి కంట్రీ క్లబ్‌ ద్వారా ఆ భవనాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. 

మొత్తం 11,416 చదరపు అడుగులు విస్తీర్ణం కలిగిన ప్రధాన బంగ్లాలో ఐదు బెడ్‌ రూమ్‌లు, ఎనిమిది బాత్‌ రూమ్‌లు, ఓ హాలు, కిచెన్‌ ఉన్నాయి. దానికి వెలుపల అతిథుల కోసం 2,349 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు బెడ్‌ రూమ్‌లు, రెండు బాత్‌ రూములు గల చిన్న భవనం ఒకటి ఉంది. 

చదవండితప్పంతా మేఘన్‌ మీదకు నెడుతున్నారు..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top