పారిస్‌లో భారీ పేలుడు | Powerful Explosion Tears Through Paris Bakery | Sakshi
Sakshi News home page

పారిస్‌లో భారీ పేలుడు

Jan 12 2019 4:18 PM | Updated on Jan 12 2019 6:55 PM

Powerful Explosion Tears Through Paris Bakery - Sakshi

పారిస్‌ : ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో శనివారం ఉదయం భారీ పేలుడు చోటు చేసుకుంది. వివరాలు.. సెంట్రల్‌ పారిస్‌లోని 9వ అరోన్‌డిస్‌మెంట్‌ ప్రాంతంలోని ఓ బేకరిలో గ్యాస్‌ లీకవ్వడంతో పేలుడు సంభవించింది. దాంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పేలుడు కారణంగా చుట్టుపక్కల భవనాలు ధ్వంసమయ్యాయి. దాంతో ఆ పరిసర ప్రాంతాలు భయంకరంగా మారాయి.

ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. కానీ ఎవరైనా మరణించారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. దాంతో పాటు పేలుడుకు గల కారణాలు కూడా ఇంకా తెలియలేదు. ప్రస్తుతం పేలుడుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement