40 పులులు.. నలుగురు మనుషులు.. | Port Lympne Reserve in briton | Sakshi
Sakshi News home page

40 పులులు.. నలుగురు మనుషులు..

Jul 12 2017 10:34 AM | Updated on Sep 5 2017 3:52 PM

40 పులులు.. నలుగురు మనుషులు..

40 పులులు.. నలుగురు మనుషులు..

పులి పలకరించింది కదాని.. పక్కన నిలబడి ఫొటో దిగకూడదురోయ్‌..

పులి పలకరించింది కదాని.. పక్కన నిలబడి ఫొటో దిగకూడదురోయ్‌.. ఇది ఓ సినిమాలోని డైలాగ్‌.. అయితే.. బ్రిటన్‌లోని కెంట్‌లో ఉన్న పోర్ట్‌ లిమ్‌ టైగర్‌ రిజర్వ్‌కు వెళ్తే.. ఇవన్నీ చేయొచ్చు. ఫొటో చూశారుగా.. అదీ సంగతి.. గత నెల్లో ఇక్కడ టైగర్‌ లాడ్జిని ప్రారంభించారు. ఇందులో ఉంటే.. ఇదిగో ఇలా పులులను మన పక్కనే చూడొచ్చు. ఎందుకంటే.. ఈ లాడ్జిని పులుల ఎన్‌క్లోజర్‌లోనే కట్టారు. వాటికి, మనకు మధ్య ఓ అద్దమే అడ్డు. ఇక్కడ మొత్తం 40 పులులున్నాయి.

ఈ లాడ్జిలోని క్యాబిన్‌లో నలుగురు ఉండొచ్చు.  మొత్తమ్మీద అద్భుతమైన అను భూతి మీ సొంతమవుతుందని టైగర్‌ రిజర్వ్‌ అధికారులు చెబుతున్నారు. ఒక రోజు ఉండాలంటే ఆఫ్‌ సీజన్‌లో రూ.31 వేలు.. సీజన్‌లో అయితే.. రూ.66 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రిజర్వ్‌లో ఖడ్గమృగాలను ఇదే తరహాలో వీక్షించేందుకు మరో లాడ్జి కూడా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement