ఆకాశంలో ఢీకొన్న విమానాలు!! | planes mid air collision injures six seriously | Sakshi
Sakshi News home page

ఆకాశంలో ఢీకొన్న విమానాలు!!

Aug 25 2014 10:31 AM | Updated on Apr 4 2019 4:44 PM

ఆకాశంలో ఢీకొన్న విమానాలు!! - Sakshi

ఆకాశంలో ఢీకొన్న విమానాలు!!

ఎక్కడైనా రోడ్డుమీద బస్సులు, ఇతర వాహనాలు ఢీకొనడం చూశాం. అయితే గతంలో ఎన్నడూ లేనట్లుగా ఆకాశంలో రెండు విమానాలు ఢీకొన్నాయి.

ఎక్కడైనా రోడ్డుమీద బస్సులు, ఇతర వాహనాలు ఢీకొనడం చూశాం. అయితే గతంలో ఎన్నడూ లేనట్లుగా ఆకాశంలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ సంఘటన స్విట్జర్లాండ్లో జరిగింది. ఈ రెండూ చిన్న విమానాలే కావడంతో ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ రెండింటిలో ఒక విమానం సెయింట్ గాలెన్లోని కాంటన్ ప్రాంతంలో ఓ పొలంలో కూలిపోయింది. అందులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడినట్లు స్విస్ వార్తాసంస్థ ఏటీఎస్ తెలిపింది.

రెండో విమానం అక్కడకు సమీపంలో ఉన్న సిట్టర్డార్ప్ ప్రాంతంలో అత్యవసరంగా దిగింది. అందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు ఏంటో మాత్రం ఇంకా ఇంతవరకు తెలియలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement