ఆ వీడియాను వాళ్లు నిజంగా చూశారా!

Pilots Allegedly Hid Camera In Toilet, Than Streamed Video  - Sakshi

వాషింగ్‌టన్‌: అమెరికాకు చెందిన ఇద్దరు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ పైలట్లు విమానంలో కెమెరాను ఉంచారన్న అభియోగంతో ఫిబ్రవరి 2017 అరీదీనా కోర్టులో కేసు నమోదైంది. ఈ ఘటన గురించి ఫ్లైట్ అటెండెంట్ రెనీ స్టెయినాకర్‌ మాట్లాడుతూ తాను కాక్‌పీట్‌లోకి ప్రవేశించగానే పైలట్లు ఐపాడ్‌లో ప్రత్యక్షంగా వీడియోను చూస్తున్నారని ఆమె ఆరోపించింది. తనతో పాటు ఫ్లైట్ 1088 లో ఉన్న మరో ముగ్గురు ఫ్లైట్ అటెండెంట్లు, విమానంలో లేని స్టెయినాకర్ భర్తను సైతం తీవ్ర వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎయిర్‌లైన్స్‌ నియమాల ప్రకారం ఇద్దరు పైలట్లు కాక్‌పిట్‌లో ఉండాలన్న నిబంధనల నేపథ్యంలో కెప్టెన్‌ టెర్రీ గ్రాహం టాయిలెట్‌కు వెళ్లే క్రమంలో తనను కాక్‌పిట్‌లోకి వెళ్లాల్సిందిగా సూచించాడంది. అప్పుడే ఈ విషయం తన కంటపడిందని.. కో పైలెట్‌ రస్సెల్‌ తన ఐపాడ్‌లో కెమెరాలో సదరు వీడియోలు చూస్తున్నాడని తెలిపింది. ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించగా భద్రతా చర్యలలో భాగంగా నైరుతి బోయింగ్ 737-800 విమానాలన్నింటిలోనూ ఈ వ్యవస్థ ఏర్పాటు చేయబడిందని రస్సెల్‌ తనను నమ్మించే ప్రయత్నం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

కాగా సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ మాత్రం విమానంలో కెమెరాలు పెట్టారన్న వార్తలను ఖండించింది. తమ ఎయిర్‌లైన్స్‌ మీద వచ్చిన ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. ఈ క్రమంలో తమ ఉద్యోగులు, ప్రయాణికులకు రక్షణ కల్పించడంలో ఏమాత్రం రాజీ పడబోమని తెలిపారు. ఇక 2017లో పిట్స్‌బర్గ్‌ నుంచి ఫోనిక్స్‌కు విమానం వెళ్తున్న క్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన కేసు ప్రస్తుతం ఫోనిక్స్‌లోని ఫెడరల్‌ కోర్టుకు మార్చబడింది.

ఇందుకు సంబంధించిన విచారణలో భాగంగా తన క్లైంట్‌ స్టెయినాకర్‌ను మాదకద్రవ్య పరీక్షల కంటే కూడా ఎక్కువగా వేధించారని ఆమె తరుపు న్యాయవాది చెప్పారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ పైలట్లు నేరం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె మాత్రం న్యాయ పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top