బిన్ లాడెన్ బతికే ఉన్నాడు! | Pakistani leaders knew about Osama's Abbottabad hideout, but US has no proof: Hillary Clinton | Sakshi
Sakshi News home page

బిన్ లాడెన్ బతికే ఉన్నాడు!

May 3 2016 8:39 PM | Updated on Mar 23 2019 8:33 PM

ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఇంకా పాకిస్తాన్ లోనే ఉన్నట్లు తాము విశ్వసిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ తెలిపారు.

ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఇంకా పాకిస్తాన్ లోనే ఉన్నట్లు తాము విశ్వసిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ తెలిపారు. తాలిబన్ అధినేత ముల్లా ఒమర్ కూడ అక్కడే ఉన్నట్లు ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని హిల్లరీ తెలిపారు.


అధ్యక్షుడు బరాక్ ఒబామాకు టాప్ అడ్వైజర్ గా ఉన్న  68 ఏళ్ళ హిల్లరీ క్లింటన్... 2011,  మే 2న ఆపరేషన్ లో భాగంగా ఆల్ ఖైదా నాయకుడు, తీవ్రవాది అయిన బిన్ లాడెన్ కనిపిస్తే చంపేయాలని ఆదేశాలు జారీ చేశారు.  అయితే ప్రస్తుతం బిన్ లాడెన్ సహా ఆల్ ఖైదా నాయకులు పాకిస్తాన్ లోనే ఉన్నట్లు ఆమె సందేహం వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలో ఆల్ ఖైదా సూత్రధారులపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని క్లింటన్ అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ బృందం 2001 సెప్టెంబర్ 11న ఆమెరికాలో జరిగిన దాడులకు బాధ్య వహించాల్సిందేనని క్లింటన్ అంటున్నారు. కాగా హిల్లరీ అనుమానాలను పాకిస్తాన్ నాయకులు ఖండిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement