పాకిస్తాన్‌ భారీకాయుడికి సర్జరీ 

Pakistan heaviest man Noorul Hassan undergoes successful liposuction surgery  - Sakshi

లాహోర్‌: పాకిస్తాన్‌లోకెల్లా అత్యధిక బరువు కలిగిన వ్యక్తికి, బరువు తగ్గేందుకు చేసిన లైపోసక్షన్‌ సర్జరీ విజయవంతమైంది. దాదాపు 330 కేజీలకు పైగా బరువుతో కదల్లేని పరిస్థితిలో ఉన్న నూరుల్‌ హసన్‌ సోషల్‌మీడియా ద్వారా తన గోడును వెల్లబోసుకున్నాడు. దాన్నిగమనించిన పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమార్‌ జావెద్‌ సర్జరీకి ఏర్పాట్లు చేశారు. రెస్క్యూ 1122 దళ సభ్యులు అతడి ఇంటి గోడను కూల్చి మరీ సైనిక వాహనం ద్వారా మిలిటరీ ఆస్పత్రికి తరలించారు. గంటా నలభై నిమిషాలపాటు నిర్వహించిన ఆపరేషన్‌ కష్టతరమైనదే అయినప్పటికీ, విజయవంతంగా పూర్తయిందని డాక్టర్‌ మౌజ్‌ అల్‌ హసన్‌ తెలిపారు. రానున్న నాలుగు రోజుల పాటు నూరుల్‌ ఐసీయూలోనే ఉంటాడని అనంతరం ఆరునెలల్లో 200 కేజీల కంటే తక్కువ బరువుకు చేరుకుంటాడని అన్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top