
ఇస్లామాబాద్: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ తన భార్యను కలుసుకునేందుకు పాకిస్తాన్ అనుమతించింది. జాధవ్‌ను కలుసుకునేందుకు వీలుగా ఆయన తల్లికి మానవతా దృక్పథంతో వీసా మంజూరు చేయాలని భారత్ పలుమార్లు చేసిన విజ్ఞప్తిపై పాక్ ఈ మేరకు స్పందించింది. మానవతా దృక్పథంతోనే జాధవ్ తన భార్యను పాక్‌లో కలుసుకునేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై జాధవ్‌కు పాక్ మిలటరీ కోర్టు ఏప్రిల్‌లో మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడంతో మరణశిక్షపై స్టే లభించింది.