హృదయ విదారకం: కూతురికి గాల్లో హగ్‌ ఇచ్చిన నర్సు..

Nurse Treating Coronavirus Patients In China Gives Air hHug To Daughter - Sakshi

బీజింగ్‌ : కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చైనాలో 700 మందికి పైగా బలి తీసుకున్న  ఈ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. దీని భయంతో చైనాలోని ప్రజలకు ఇళ్లు విడిచి బయటికి వెళ్లడానికి జంకుతున్నారు. ఇక అక్కడి ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, సిబ్బంది పరిస్థితి ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వైరస్‌ తమపై దాడి చేస్తుందని తెలిసినా ప్రాణాలకు తెగించి మరీ రోగులకు సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులను కలిసేందుకు కూడా సమయం లేకుండా పోయింది. ఇందుకు నిదర్శనంగా నిలిచిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. (‘కరోనా వైరస్‌’ కేసులు ఇంకా ఎక్కువే!)

చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌లోని ఫగౌ కౌంటీ పీపుల్స్‌ హాస్పిటల్‌ లియు హైయాన్‌ అనే నర్సు పనిచేస్తోంది. ఆమె గత 10 రోజుల నుంచి తన తొమ్మిదేళ్ల కుమార్తె చెంగ్‌ షివెన్‌ను చూడకుండా ఆస్పత్రిలోని కరోనా పేషేంట్లకు తన సేవలందిస్తున్నారు. దీంతో తల్లిని చూసేందుకు ఆమె కూతురు ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే వారిద్దరినీ కలుసుకోడానికి అనుమతినివ్వలేదు. ఇద్దరు దగ్గరకు చేరితే కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని కొన్ని మీటర్ల దూరంలోనే నిలుచోబెట్టారు. దీంతో తల్లి కూతురులిద్దరూ దూరంగా ఉండే మాట్లాడుకున్నారు. (కరోనా వైరస్‌కు అమెరికా పౌరుడు బలి)

తల్లిని మిస్‌ అవ్వుతున్నాని దూరం నుంచే ఏడుస్తూ కూతురు భావోద్వేగానికి లోనయ్యింది. దీనికి తల్లి స్పందిస్తూ నేను రాక్షసులతో పోరాడుతున్నాను. వైరస్‌ తగ్గిపోగానే తిరిగి ఇంటికి వచ్చి నిన్ను కలుస్తా అంటూ తెలిపారు. అనంతరం గాల్లోనే ఇద్దరూ హగ్‌ ఇచ్చుకున్నారు. తర్వాత కూతురు తల్లి కోసం తెచ్చిన ఆహారాన్ని బయట పెట్టి వెళ్లిపోయింది. దాన్ని తల్లి లియా తీసుకొని తిరిగి హాస్పిటల్‌కు వెళ్లిపోయారు. ఇక ఈ హృదయ విదారక దృశ్యాలు అందరి చేత కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కంటతడి పెట్టిస్తోంది. ‘ఇది చాలా బాధాకరమైనది. రాక్షస మహమ్మారి నుంచి బయట పడేందుకు చైనాకు సహాయం చేద్దాం’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

చదవండి : కరోనా భయం; వీడియో కాల్‌లో ఆశీర్వాదాలు

విషాద ఛాయల మధ్య ఆనందోత్సవాలు..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top