అమాయకులను కూడా చంపేశాం: ఒబామా | No doubt american drones have killed civilians, says Barack Obama | Sakshi
Sakshi News home page

అమాయకులను కూడా చంపేశాం: ఒబామా

Apr 2 2016 8:50 AM | Updated on Sep 3 2017 9:05 PM

అమాయకులను కూడా చంపేశాం: ఒబామా

అమాయకులను కూడా చంపేశాం: ఒబామా

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆశ్చర్యకర నిజాలను బయటపెట్టారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆశ్చర్యకర నిజాలను బయటపెట్టారు. ఓ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న ఆయన ఉగ్రవాదం అంశంపై మాట్లాడారు. అమెరికా డ్రోన్లు ఎంతో మంది అమాయక జనాలను పొట్టనపెట్టుకున్నాయని అంగీకరించారు. అయితే డ్రోన్ల ద్వారా చేస్తున్న యుద్ధాన్ని మాత్రం సమర్థించుకున్నారు. ఈ పాలసీకి తాను ఎప్పుడు అనుకూలమేనని మరోసారి స్పష్టం చేశారు. అణుభద్రత సదస్సులో డ్రోన్ల ద్వారా నిర్వహిస్తున్న భద్రతపై ఇరవై దేశాల అధినేతలతో చర్చించారు. తమ దేశం చాలా తప్పులు చేసిందని.. అయితే ఉగ్రవాదులను ఎదుర్కోవాలంటే కాస్త కఠినంగా ఉండాల్సి వస్తుందన్నారు.

ఐఎస్ఎస్, ఇరాన్ తో అణు ఒప్పందం అంశాలు ఈ సదస్సులో కీలక అంశాలుగా మారాయని చెప్పుకొచ్చారు. గత కొన్ని వారాలుగా ఐఎస్ఎస్ మిలిటెంట్లు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశాలున్నాయని, మహిళలు, చిన్నారులు వారి టార్గెట్ అవుతున్నారని పేర్కొన్నారు. ఇరాన్ లో అమెరికా కరెన్సీని వినియోగించడాన్ని నిషేధించాలని అమెరికా భావిస్తుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.  ఉగ్రవాదాన్ని అణచివేయడానికి, అరికట్టడానికి తాము చాలా కృషి చేస్తున్నామని, ఇకముందు అమెరికా దాడులు గతంలో మాదిరిగా ఉండవంటూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను బరాక్ ఒబామా హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement