-
యూఎస్ డ్రోన్ దాడిలో ఐసిస్–కె ఉగ్రవాదుల మృతి
వాషింగ్టన్/కాబూల్: కాబూల్ బాంబుదాడికి ప్రతీకారంగా అమెరికా ఐసిస్–కె సూత్రధారులిద్దరిని డ్రోన్‌దాడిలో హతమార్చింది. అఫ్గాన్ లోని నాన్గర్హర్ ప్రావిన్సు ప్రాంతంలోని ఐసిస్ స్థావరాలపై ఈ దాడి జరిగినట్లు అమెరికా ప్రతినిధి కెప్టెన్ బిల్ అర్బన్ చెప్పారు. అఫ్గానిస్తాన్‌లో ఉగ్రఘాతుకానికి పాల్పడ్డ ఐసిస్ మూకలపై ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ శపథం చేసిన సంగతి తెలిసిందే! అధ్యక్షుడి ప్రకటన వచ్చిన గంటల వ్యవధిలోనే మిలటరీ డ్రోన్ దాడులు చేసింది. దాడుల్లో ఇద్దరు ఐసిస్ వ్యూహకర్తలు మరణించారని, ఒకరు గాయపడ్డాడని మిలటరీ ప్రతినిధి హాంక్ టేలర్ చెప్పారు. దాడిలో సామాన్య పౌరులెవరూ గాయపడలేదన్నారు. మరణించిన ఐసిస్ వ్యూహకర్తలకు కాబూల్ దాడితో సంబంధం ఉందో, లేదో తెలియరాలేదు. వీరి వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. విమానాశ్రయంపై దాడి అనంతరం ఉగ్రమూకలు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో జో బైడెన్ డ్రోన్ దాడులకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఐసిస్–కెలో 14 మంది కేరళీయులు? ఐసిస్–కె ఉగ్రవాద సంస్థలో 14 మంది కేరళ రాష్ట్రానికి చెందినవారు భాగస్వాములుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత బగ్రామ్ జైలు నుంచి వారిని విడుదల చేశారు. వారంతా ఐసిస్–కెతో ఉంటూ ఈ పేలుళ్లకు పన్నాగం పన్నిన వారిలో ఉన్నారని అఫ్గాన్ నుంచి సమాచారం వచ్చినట్టుగా జాతీయ మీడియా పేర్కొంది. 14 మందిలో 13 మంది ఇంకా కాబూల్‌లోనే ఉన్నారు. కేరళలోని మల్లాపురం, కసర్గోడ్, కన్నూర్ జిల్లాలకు చెందిన వీళ్లంతా ఏడేళ్ల క్రితమే కాబూల్‌కి వెళ్లి ఉగ్రసంస్థలో చేరారు. అమెరికా బలగాలు వారిని జైలు పాలు చేస్తే, తాలిబన్లు తిరిగి బయటకు తీసుకువచ్చారు. అఫ్గాన్ ఉగ్ర కార్యకలాపాల్లో కేరళ వాసుల హస్తం ఉందని తాలిబన్లు ప్రచారం చేసి అంతర్జాతీయంగా భారత్ పరువుని బజారుకీడుస్తారేమోనని కేంద్రం ఆందోళనలో ఉంది. కాబూల్‌లోని టర్క్మెనిస్తాన్ ఎంబసీ వద్ద పేలుళ్లు జరిపేందుకు యత్నించిన ఇద్దరు పాక్ జాతీయులను తాలిబన్లు అడ్డుకున్నారు. సున్నీ పస్తూన్ ఉగ్ర సంస్థకు చెందిన వీరు పేలుడు పదార్థాలతో ఉండగా పట్టుబడ్డారు. -
అమాయకులను కూడా చంపేశాం: ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆశ్చర్యకర నిజాలను బయటపెట్టారు. ఓ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న ఆయన ఉగ్రవాదం అంశంపై మాట్లాడారు. అమెరికా డ్రోన్లు ఎంతో మంది అమాయక జనాలను పొట్టనపెట్టుకున్నాయని అంగీకరించారు. అయితే డ్రోన్ల ద్వారా చేస్తున్న యుద్ధాన్ని మాత్రం సమర్థించుకున్నారు. ఈ పాలసీకి తాను ఎప్పుడు అనుకూలమేనని మరోసారి స్పష్టం చేశారు. అణుభద్రత సదస్సులో డ్రోన్ల ద్వారా నిర్వహిస్తున్న భద్రతపై ఇరవై దేశాల అధినేతలతో చర్చించారు. తమ దేశం చాలా తప్పులు చేసిందని.. అయితే ఉగ్రవాదులను ఎదుర్కోవాలంటే కాస్త కఠినంగా ఉండాల్సి వస్తుందన్నారు. ఐఎస్ఎస్, ఇరాన్ తో అణు ఒప్పందం అంశాలు ఈ సదస్సులో కీలక అంశాలుగా మారాయని చెప్పుకొచ్చారు. గత కొన్ని వారాలుగా ఐఎస్ఎస్ మిలిటెంట్లు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశాలున్నాయని, మహిళలు, చిన్నారులు వారి టార్గెట్ అవుతున్నారని పేర్కొన్నారు. ఇరాన్ లో అమెరికా కరెన్సీని వినియోగించడాన్ని నిషేధించాలని అమెరికా భావిస్తుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి, అరికట్టడానికి తాము చాలా కృషి చేస్తున్నామని, ఇకముందు అమెరికా దాడులు గతంలో మాదిరిగా ఉండవంటూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను బరాక్ ఒబామా హెచ్చరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్‌నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్‌పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
Advertisement