హఫీజ్‌ పై కేసే లేదు: పాక్ | Sakshi
Sakshi News home page

హఫీజ్‌ పై కేసే లేదు: పాక్

Published Tue, Sep 16 2014 1:13 AM

no case on Hafiz Saeed

న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడుల  ప్రధాన కుట్రదారు ఉగ్రవాది హఫీజ్ సయీద్‌పై ఎలాంటి కేసూ పెండింగ్‌లో లేదని, పాకిస్థాన్ పౌరుడైన హఫీజ్‌కు పాక్‌లో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉందని పాకిస్థాన్ సోమవారం ప్రకటించింది.  హఫీజ్‌తో ఎలాంటి సమస్యా లేదని భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యానించారు. సయీద్ నిర్దోషిగా కోర్టులు ఇదివరకే ప్రకటించాయని ఢిల్లీలో అన్నారు. దీనిపై స్పందించిన భారత్  హఫీజ్‌ను వెంటనే అరెస్ట్ చేసి, కోర్టు విచారణకు అప్పగించాలంది.

Advertisement
 
Advertisement
 
Advertisement