కొత్త.. న్యూ.. నయా.. | New monkey gender found in North himalayas | Sakshi
Sakshi News home page

కొత్త.. న్యూ.. నయా..

Oct 6 2015 2:50 AM | Updated on Sep 3 2017 10:29 AM

కొత్త.. న్యూ.. నయా..

కొత్త.. న్యూ.. నయా..

వర్షమొస్తే చాలు తుమ్ములు ఆగని కోతి.. నాలుగు రోజులైనా నేలపై బతకగలిగే చేప..

వర్షమొస్తే చాలు తుమ్ములు ఆగని కోతి.. నాలుగు రోజులైనా నేలపై బతకగలిగే చేప.. ఇలాంటివెన్నో కొత్త వృక్ష, జీవజాతులను వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(డబ్ల్యూడబ్ల్యూఎఫ్)కు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. అది కూడా మన ఉత్తర హియాలయాల్లోనే.. 2009-14 మధ్య నేపాల్, మయన్మార్, భూటాన్, ఈశాన్య భారత్‌లో తాము సాగించిన అన్వేషణలో 211 కొత్త జాతులను కనుగొన్నట్లు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తెలిపింది.

పైకి తిరిగినట్లుండే ముక్కు ఉన్న ఈ కోతికి వర్షాకాలమొస్తే.. తుమ్ములు ఆగవట. దానికి కారణం దాని ముక్కున్న తీరే.. పైకి ఉన్నట్లు ఉండటం వల్ల నీళ్లు ముక్కులోకి చేరడం.. తుమ్ములు రావడం కామనే కదా.. ఇక నీలి రంగులో ఉన్న ఈ చేపలు నీళ్లు లేకున్నా.. నేలపై నాలుగు రోజుల వరకూ బతికి ఉండగలవట. అంతేకాదు.. అలా పాక్కుంటూ పాక్కుంటూ పావు కిలోమీటరు దాకా ఇవి వెళ్లగలవట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement