ఒంటరి నక్షత్రం..

NASA scientists discover rare, isolated neutron star - Sakshi

వాషింగ్టన్‌: మన పాలపుంతకు ఆవల 2 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో తొలిసారి ఓ ప్రత్యేకమైన ఒంటరి న్యూట్రాన్‌ స్టార్‌ను నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నక్షత్రానికి సంబంధించిన చిత్రాన్ని నాసా విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ తరహా నక్షత్రాలను మన పాలపుంతలో పదికిపైనే కనుగొన్నా.. పాలపుంతకు ఆవల కనుగొనడం మాత్రం ఇదే తొలిసారి. సాధారణంగా న్యూట్రాన్‌ స్టార్ల లాంటి నక్షత్రాలు పెద్ద పెద్ద నక్షత్రాల అంతర్భాగంలో ఉంటాయి. అయితే ఈ పెద్ద పెద్ద నక్షత్రాలు అంతరించిపోయి సూపర్‌నోవాగా అవతరిస్తాయి. ఈ పరిశోధన ఫలితాలు నేచర్‌ ఆస్ట్రానమీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top