-
ఒంటరి నక్షత్రం..
వాషింగ్టన్: మన పాలపుంతకు ఆవల 2 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో తొలిసారి ఓ ప్రత్యేకమైన ఒంటరి న్యూట్రాన్ స్టార్‌ను నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నక్షత్రానికి సంబంధించిన చిత్రాన్ని నాసా విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ తరహా నక్షత్రాలను మన పాలపుంతలో పదికిపైనే కనుగొన్నా.. పాలపుంతకు ఆవల కనుగొనడం మాత్రం ఇదే తొలిసారి. సాధారణంగా న్యూట్రాన్ స్టార్ల లాంటి నక్షత్రాలు పెద్ద పెద్ద నక్షత్రాల అంతర్భాగంలో ఉంటాయి. అయితే ఈ పెద్ద పెద్ద నక్షత్రాలు అంతరించిపోయి సూపర్నోవాగా అవతరిస్తాయి. ఈ పరిశోధన ఫలితాలు నేచర్ ఆస్ట్రానమీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
మానవుడికి విశ్వంతో బంధం!
లాస్ఏంజెలిస్: మానవుడికి, విశ్వానికి మధ్య మనం ఊహించిన దాని కన్నా దగ్గరి సంబంధాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మానవుడి కణ ద్రవ్య నిర్మాణం, పరమాణు నక్షత్రం (న్యూట్రాన్ స్టార్) సమానంగా ఉన్నాయని, ఈ రెండింటి మధ్య చాలా సారూప్యత ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కణాల్లో ఉండే ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉన్న స్ప్రింగ్ మాదిరి కొన్ని నిర్మాణాలకు సంబంధించి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్త శాంటా బార్బరా అధ్యయనం చేశారు. ఈ నిర్మాణాలకు ‘టెరసకి రాంప్స్’ అని పేరుపెట్టారు. పరమాణు నక్షత్ర పటలంలో కూడా ఇలాంటి నిర్మాణాలే ఉన్నట్లు పరమాణు భౌతికశాస్త్రవేత్త చార్లెస్ హోరోవిట్జ్ కనుగొన్నారు. పరమాణు నక్షత్రంలోని నాళికలు (స్పగెట్టీ), పత్రాలను (లసగ్నా) స్ప్రింగ్ మాదిరి నిర్మాణాలు కలిపి ఉంచుతున్నాయని, ఈ స్ప్రింగులు.. టెరసకి రాంప్స్ నిర్మాణాలతో సరిపోలుతున్నాయని గుర్తించారు. అయితే ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఉష్ణగతిక శాస్త్రంపై ఆధారపడి ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా భౌతిక శాస్త్రవేత్త గ్రెగ్ హుబర్ పేర్కొన్నారు. కేంద్రకం, కణాంతర్గతంగా ఉన్న సాంద్రత, ఉష్ణోగ్రత, పీడనం వంటి అంశాలు ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement