నా గురువు భారత్: దలైలామా | My teacher in India: Dalai Lama | Sakshi
Sakshi News home page

నా గురువు భారత్: దలైలామా

Jan 2 2015 2:56 AM | Updated on Sep 2 2017 7:04 PM

నా గురువు భారత్: దలైలామా

నా గురువు భారత్: దలైలామా

భారత్‌ను తన గురువుగా పరిగణిస్తానని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా తెలిపారు.

సూరత్: భారత్‌ను తన గురువుగా పరిగణిస్తానని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా తెలిపారు. తొలిసారి గుజరాత్‌కు విచ్చేసిన దలైలామా తన పర్యటనలో భాగంగా గురువారం సూరత్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నా మనసంతా నలంద ఆలోచనలతో నిండిపోయింది. అది ప్రాచీన భారత ఆధ్యాత్మిక సంస్థ. అందుకే నేను భారత్‌ను గురువుగా భావిస్తా’’ అని చెప్పారు. దలైలామా సేవలకు గుర్తింపుగా సూరత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త అందిస్తున్న సంతోక్బా అవార్డును అందుకునేందుకు దలైలామా సూరత్ వచ్చారు. అవార్డు కింద రూ. 25 లక్షల నగదు, వజ్రంతో కూడిన జ్ఞాపికను అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement