
పారిస్, ఫ్రాన్స్ : పౌరసత్వ వేడుకలో అధికారులకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించిందనే కారణంగా ఓ ముస్లిం మహిళకు పౌరసత్వం కల్పించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్రెంచ్ సమాజంతో మమేకం అవడానికి ఆమె సుముఖంగా లేదనడానికి ఈ ఘటన నిదర్శనమని పేర్కొంది. ఈ విధంగా ప్రవర్తించడం ద్వారా ఆమె ఫ్రెంచ్ పౌరసత్వ నియమావళిని ఉల్లంఘించిందని తెలిపింది. ఫ్రాన్స్ జాతీయులుగా కావాలంటే నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
మత విశ్వాసాలకు అనుగుణంగానే..
అల్జీరియాకు చెందిన ముస్లిం మహిళ 2010లో ఫ్రాన్స్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి పౌరసత్వం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తూనే ఉంది. కానీ ప్రభుత్వ నిర్ణయం తనకు నిరాశ కలిగించిందని తెలిపింది. తాను మతాచారాలను గౌరవిస్తానని, అందుకే అధికారులతో చేతులు కలపడానికి నిరాకరించినట్లు పేర్కొంది.