ఎగిరింది 60 అడుగులే.. కుప్పకూలిన రాకెట్‌.. | MOMO-2 Rocket Crash Landed On Launch Pad | Sakshi
Sakshi News home page

ఎగిరింది 60 అడుగులే.. కుప్పకూలిన రాకెట్‌..

Jun 30 2018 4:19 PM | Updated on Jun 30 2018 5:13 PM

MOMO-2 Rocket Crash Landed On Launch Pad - Sakshi

టోక్యో, జపాన్‌ : ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తయారు చేసిన రాకెట్‌ తారాజువ్వలా 60 అడుగులు ఎగిరి అక్కడే కుప్పకూలింది. జపాన్‌కు చెందిన ఇంటర్‌స్టెల్లార్‌ టెక్నాలజీస్‌ మోమో-2 పేరుతో దాదాపు 2.7 మిలియన్‌ డాలర్లను ఖర్చు చేసి రాకెట్‌ను తయారు చేసింది. దక్షిణ హొకైడో ద్వీపంలోని టైకి అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

దాదాపు 10 మీటర్ల పొడవున్న మోమో-2 రాకెట్‌ లాంచింగ్‌ పాడ్‌ నుంచి గాలిలోకి 60 అడుగుల ఎత్తు ఎగిరి కుప్పకూలింది. గతేడాది మోమో రాకెట్‌ ప్రయోగం కూడా ఇదే తరహాలో విఫలం చెందింది. ఈ ఘటనలో లాంచింగ్‌ పాడ్‌ కొద్దిగా దెబ్బతింది. అయితే, ఎవరికీ గాయాలు కాలేదని ఇంటర్‌స్టెల్లార్‌ వ్యవస్థాపకుడు టకఫుమి హొరీ తెలిపారు. ప్రయోగ విఫలానికి గల కారణాలను అన్వేషించి మళ్లీ ప్రయోగం చేపడతామని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement