పురుషులు గర్భం దాల్చే అవకాశం ఉంది

Men could get pregnant with womb transplants - Sakshi

టెక్సాస్‌ : వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ మగవాళ్లు కూడా గర్భం దాల్చే రోజులు రానున్నాయని నిపుణులు చెబుతున్నారు. మగవారు కూడా పిల్లల్ని కనడానికి భవిష్యత్తులో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని డాక్టర్‌ రిచర్డ్‌ పాల్సన్‌ స్పష్టం చేశారు. అమెరికా పునరుత్పత్తి వైద్య సంఘం అధ్యక్షుడు అయిన పాల్సన్‌ శాన్ ఆంటోనియోలో నిర్వహించిన వార్షిక సమావేశంలో ఈ అంశంపై ప్రసంగించారు. 

లింగమార్పిడి చేయించుకున్న పురుషులు... గర్భాశయ మార్పిడికి కూడా ముందుకు రావచ్చని ఆయన అన్నారు. లింగ మార్పిడి అనంతరం పురుషుడిలో గర్భాశయాన్ని ప్రవేశపెట్టడానికి శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అన్నారు. సాధారణ పురుషుల్లో కాన్పు మాములు విషయం కాదని ఆయన చెప్పారు. పురుషులు, స్త్రీల మధ్య పొత్తి కడుపు నిర్మాణం తేడాగా ఉండటమే అందుకు కారణమని పాల్సన్‌ తెలిపారు.

అయితే క్లిష్ట తరమైన ఈ సమస్యకు సిజేరియన్ ద్వారా కాన్పు చేయాల్సి ఉంటుందని చెప్పారు. గర్భాశయంలో పిండం సక్రమంగా ఎదగడానికి మహిళల్లో ప్రకృతిసిద్ధంగా కొన్ని హార్మోన్లు విడుదల అవుతాయాని... ఈ హార్మోన్లను పురుషులకు కృత్రిమంగా ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. మగవారికి అవసరమైన మందులు మార్కెట్లలో విరివిగా ఉన్నాయని... దీని కారణంగా మగవారు పిల్లలను కనొచ్చని చెప్పారు. అయితే దీనిపై అభ్యంతరాలు లేవనెత్తవాళ్లు నుంచి మాత్రమే సమస్య ఉండొచ్చన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top