మెలానియా ట్రంప్‌ విగ్రహానికి నిప్పు | Melania Trump Statue Set On Fire In Slovenia | Sakshi
Sakshi News home page

మెలానియా విగ్రహం ధ్వంసం

Jul 9 2020 8:55 AM | Updated on Jul 9 2020 3:06 PM

Melania Trump Statue Set On Fire In Slovenia - Sakshi

మెలానియా ట్రంప్‌ విగ్రహం దగ్ధం

స్లొవేనియా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భార్య మెలానియా ట్రంప్‌ స్వస్థలం స్లొవేనియాలో ఏర్పాటైన ఆమె విగ్రహానికి కొందరు నిప్పుపెట్టిన ఘటన వెలుగుచూసింది. జులై 4న అమెరికన్లు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్న రోజునే చెక్కతో తయారైన మెలానియా విగ్రహానికి నిప్పంటించారని ఈ విగ్రహం రూపొందించిన కళాకారుడు వెల్లడించారు. ఈ ఘటనపై జులై 5న పోలీసులు తనకు సమాచారం ఇవ్వగానే దెబ్బతిన్న విగ్రహాన్ని తొలగించానని బెర్లిన్‌కు చెందిన అమెరికన్‌ ఆర్టిస్ట్‌ బ్రాడ్‌ డౌనీ తెలిపారు. వారు ఇలా ఎందుకు చేశారో తాను తెలుసుకోవాలని భావిస్తున్నానని డౌనీ అన్నారు.

ఈ ఘటన అమెరికాలో రాజకీయ చర్చకు తెరలేపుతుందని ఆయన భావిస్తున్నారు. వలసదారులపై ఉక్కుపాదం మోపిన అధ్యక్షుడిని వివాహం చేసుకున్న వలసదారుగా మెలానియా ట్రంప్‌ పరిస్థితికి ఇది అద్దం పడుతోందని డౌనీ వ్యాఖ్యానించారు. కాగా మెలానియా ట్రంప్‌ విగ్రహం ధ్వంసం ఘటనపై వాషింగ్టన్‌లోని ఆమె కార్యాలయ వర్గాలు ఇంతవరకూ స్పందించలేదు. డౌనీ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా పూర్తికానందున ఎలాంటి వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. కాగా స్లొవేనియాలో స్దానిక ఆర్టిస్ట్‌ డిజైన్‌ చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ వుడెన్‌ విగ్రహాన్ని కూడా ఈ ఏడాది జనవరిలో దుండగులు దగ్ధం చేశారు. చదవండి : మెలనియా ఫస్ట్‌ లేడీ ఎలా అవుతారు?.. ఇవాంక
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement