150 ఏళ్లు జీవిస్తాడట! | Meet the doctor who is convinced he will live to 150 | Sakshi
Sakshi News home page

150 ఏళ్లు జీవిస్తాడట!

Apr 27 2015 4:13 PM | Updated on Sep 3 2017 12:59 AM

150 ఏళ్లు జీవిస్తాడట!

150 ఏళ్లు జీవిస్తాడట!

పెళ్లి పెటాకులు లేకుండా తాను నిక్షేపంగా 150 ఏళ్లు బతుకుతానని ‘యాంటీ ఏజింగ్ ఎక్స్‌పర్ట్’ డాక్టర్ అలెక్స్ జావోరొంకోవ్ చెబుతున్నారు.

లండన్: పెళ్లి పెటాకులు లేకుండా తాను నిక్షేపంగా 150 ఏళ్లు బతుకుతానని ‘యాంటీ ఏజింగ్ ఎక్స్‌పర్ట్’ డాక్టర్ అలెక్స్ జావోరొంకోవ్ చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతోపాటు వయోభారాన్ని అరికట్టే మందులు, సప్లిమెంట్లు తీసుకుంటూ జీవిస్తానని తెలిపారు. పెళ్లి, పిల్లలు బాదరబందీ లేకుండా తన భావి జీవితాన్ని మొత్తం ఏజింగ్‌ను అరికట్టే ప్రయోగాలకే అంకితం చేస్తానని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లోని బయోజెరంటాలోజీ రీసెర్చ్ ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. భవిష్యత్తులో జన్యువుల చికిత్సకు సంబంధించిన వ్యాక్సిన్‌లు కూడా అందుబాటులోకి వస్తాయని, వాటిని కూడా తాను తీసుకుంటానని ఆయన చెప్పారు.

మానవుల ఆయుషు ప్రమాణం 150 ఏళ్లకు చేరుకున్నప్పుడు 74 ఏళ్లకు వృద్ధాప్యం ప్రారంభమవుతుందని అన్నారు. జాతీయ గణాంకాల ప్రకారం బ్రిటన్‌లో ఆయుషు ప్రమాణం మగవాళ్లలో 78.8 ఏళ్లు, ఆడవాళ్లలో 82.8 ఏళ్లని ఆయన చెప్పారు. ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల బ్రిటన్‌లో ఆయుషు ప్రమాణం గణనీయంగా పెరిందన్నారు. మానవుల ఏజింగ్‌ను అరికట్టే ప్రయోగాలెన్నో ఇప్పటికే విజయం సాధించాయని, అయితే అవి మందుల రూపంలో మనకు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement