మధుమేహానికి జన్యుచికిత్స!

Gene therapy for diabetes - Sakshi

పరి పరిశోధన

జన్యువుల్లో మార్పులు చేస్తే బోలెడన్ని వ్యాధులకు సమర్థంగా చికిత్స కల్పించవచ్చు. అయితే ఇందుకోసం జన్యువులను కత్తిరించాలి. అవసరమైన కొత్త జన్యువులను చేర్చాలి లేదంటే తొలగించాలి. ఈ మార్పులు చేర్పులు దీర్ఘకాలంలో శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియని కారణంగా ఇప్పటివరకూ జన్యుచికిత్స అంతగా అందుబాటులోకి రాలేదు. సాల్క్‌ ఇన్‌స్టిట్యూట్‌  శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు ఈ లోటు కూడా తీరనుంది. జన్యు ఎడిటింగ్‌ టెక్నాలజీ క్రిస్పర్‌ –క్యాస్‌ 9 సాయంతో వీరు ఎలాంటి కత్తిరింపులు లేకుండానే మధుమేహంతోపాటు కొన్ని ఇతర జబ్బులను సమర్థంగా నయం చేయగలిగారు.

ఎలుకలపై జరిపిన ఈ ప్రయోగాల్లో అవసరమైన జన్యువులను చైతన్యపరచడం లేదంటే ఆఫ్‌ చేయడం ద్వారా తాము వ్యాధులను నయం చేయగలిగినట్లు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త జువాన్‌ కార్లోస్‌ అంటున్నారు. క్రిస్పర్‌ క్యాస్‌ 9 టెక్నాలజీలో జన్యువులను కత్తిరించే క్యాస్‌ 9 ఎంజైమ్‌ స్థానంలో తాము చైతన్యం లేని డీక్యాస్‌ 9ను ఉపయోగించామని, దీనివల్ల ఇది నిర్దిష్ట జన్యువును కచ్చితంగా చేరుకోగలిగినా.. దానికి ఏమాత్రం నష్టం కలిగించదని జువాన్‌ తెలిపారు. డీక్యాస్‌ 9 ఎంజైమ్‌కు కొన్ని రసాయనాలను జోడించడం ద్వారా కావాల్సిన జన్యువులను ఆన్‌/ఆఫ్‌ చేయగలదని వివరించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితోపాటు మధుమేహం, మస్కులర్‌ డిస్ట్రోఫీ వ్యాధులపై తాము ఈ టెక్నాలజీని ప్రయోగించిన సత్ఫలితాలు రాబట్టామన్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top