పప్పులు తినడం మంచిదేనా? పరిశోధనలో షాకింగ్‌ విషయాలు | Sakshi
Sakshi News home page

పప్పులు తినడం మంచిదేనా? పరిశోధనలో షాకింగ్‌ విషయాలు

Published Sun, Dec 10 2023 8:54 AM

Should Diabetics Have Dal Study What Said - Sakshi

భారతీయ వంటకాల్లో పప్పులు చాలా ప్రధానమైనవి. కచ్చితంగా ఏదో రూపంలో మన ఆహారంలో పప్పులు తీసుకుంటాం. అది పప్పుగా వండుకుని తీసుకోవడం లేదా స్నేక్స్‌ రూపంలోనో పప్పులను తీసుకోవడం జరగుతుంది. అలాంటి వాటిని రోజూవారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహగ్రస్తులకు ఇంకా మంచిదని నొక్కి చెబుతున్నారు. అంతేగాదు పరిశోధకులు పప్పుధాన్యాలపై జరిపిన అధ్యయనంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి అవేంటంటే..

పరిశోధకుల అధ్యయనం ప్రకారం అన్ని రకాల కాయధాన్యాలు, చిక్కుళ్లు జాతికి చెందినవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే వాటిలో మంచి ప్రోటీన్‌లు ఉంటాయి. అవి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అదీగాక పప్పుల్లో తక్కువుగా గ్లైసెమిక్‌ ఇండెక్స్‌(జీఐ) ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెరని ప్రభావవంతంగా తగ్గిస్తాయి. అందువల్ల టైప్‌ 2 మధుమేహం ఉన్నవారికి అధిక ఫైబర్‌ ఉన్న పప్పు దినుసులు ఎంత మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు టోరంటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సుమారు 121 మంది మధుమేహ రోగులపై అధ్యయనం నిర్వహించారు. వారిలో సగం మందికి ఆహారంలో ప్రతిరోజూ ఒక పప్పు ధాన్యాలను చేర్చారు. మిగిలిన సగం మందికి గోధుమ ఆహారాన్ని ఇచ్చారు.

అధికంగా పప్పుజాతికి సంబంధించిన వాటిని తీసుకున్న వారిలో చక్కెర హెచ్‌బీఏ1సీ(హీమోగ్లోబిన్‌ ఏ1సీ) స్థాయిల్లో తగ్గుదల కనిపించింది. ఇందులో ఉండే ఫైబర్లు రక్తంలోని చక్కెరను సమర్ధవంతగా నియంత్రించాయి. ముఖ్యంగా పప్పులో తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌(జీఐ) ఉండటం కారణంగా రక్తంలోని గ్లైసెమిక్‌ని సులభంగా నియంత్రించగలదని తెలిపారు. ఈ పప్పుజాతికి చెందిన కాయధాన్యాలు నేరుగా రక్తంలోనే గ్లూకోజ్‌ని విడుదల చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి పెరగదని చెబుతున్నారు. వీటిలో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా విచ్ఛిన్నమవుతాయి.

అందువల్ల రక్తంలో గ్లూకోజ్‌ని సమస్థాయిలో ఉంచడం లేదా స్థిరంగా ఉండేటట్లు చేస్తాయిని చెబుతున్నారు. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు పప్పుధాన్యాలు అత్యంత మంచివి. వీటిలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఈజీగా రక్తంలో కరిగిపోగలదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వుల, తక్కువ గ్లైసెమిక్‌ ఆహారా పదార్థాల తోపాటు ఈ పప్పు ధాన్యాలను కూడా చేర్చితే  మరింత పోషాకాలతో కూడిన ఆహారం అందినట్లు అవుతుంది. పైగా షుగర్‌ కూడా కంట్రోల్‌లో  ఉంటుంది

పప్పులకి సంబంధించిన మరిన్నీ ఆసక్తికర విషయాలు..

  • కెనడియన్ల అధ్యయనం ప్రకారం పప్పు ధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరం కార్బోహైడ్రేట్లుకు ప్రతిస్పదించే విధానం ప్రభావితం అవుతున్నట్లు గమనించారు. ఫలితంగా గ్లూకోజ్‌ స్థాయిలు తగ్గుతున్నట్లు తెలిపారు
  • అధ్యయంనంలో బంగాళ దుంపలు, బియ్యం స్థానంలో పప్పులు తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు సుమారు 20%కి పైనే తగ్గుతాయి.
  • సగం అన్నం స్థానంలో అధికంగా కాయధాన్యాలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు సుమారు 20% వరకు తగ్గుదల కనిపించింది
  • పూర్తిగా పప్పుధాన్యాలను తీసుకుంటే 35%పైగా చక్కెర స్థాయిలు తగ్గుతాయిని చెబుతున్నారు పరిశోధకులు
  • కాబట్టి పప్పులను మీ రోజూవారి ఆహారంలో సూప్‌ రూపంలోనే లేదా స్నాక్స్‌ కింద ఉకడబెట్టి తీసుకున్నా మంచిది. అదీగాకుండా మీరు తీసుకునే సలాడ్‌లో వీటిని కూడా చేర్చుకున్నా మంచిదే. అలా ​కాకుండా రోజూ పప్పుతినలేం అనుకున్న వాళ్లు, ముఖ్యంగా నాన్‌ వెజ్‌ ప్రియులు మీరు తినే చికెన్‌, మటన్‌కి ఈ పప్పు ధాన్యాలను జోడించి తీసుకోవచ్చని చెబుతున్నారు పోషాకాహార నిపుణులు. 

(చదవండి: చపాతీలు డయాబెటిక్‌ రోగులకు మేలు! వెలుగులోకి షాకింగ్‌ విషయాలు)

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement