కారు ఢీకొట్టడంతో.. ఎగిరిపడినా..! | Man survives horrific hit and run in Brighton | Sakshi
Sakshi News home page

కారు ఢీకొట్టడంతో.. ఎగిరిపడినా..!

Jan 27 2016 4:43 PM | Updated on Aug 29 2018 8:39 PM

కారు ఢీకొట్టడంతో.. ఎగిరిపడినా..! - Sakshi

కారు ఢీకొట్టడంతో.. ఎగిరిపడినా..!

హిట్ అండ్ రన్ కేసులో ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకుని మృత్యుంజయుడిగా బయటపడ్డాడు.

లండన్: హిట్ అండ్ రన్ కేసులో ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకుని మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. వేగంగా వెళ్తున్న కారు 53 ఏళ్ల వ్యక్తిని ఢీకొట్టి, ఆపకుండా వెళ్లిపోయింది. కారు ఢీకొట్టగానే బాధితుడు కారుపై ఎగిరిపడి వెనకాల రోడ్డుపై పడ్డాడు. ఈ నెల 14న ఇంగ్లండ్లోని బ్రిగ్టన్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు నమోదైన  సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.

కెంప్టౌన్ ప్రాంతంలో బాధితుడు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితుడి తలకు తీవ్రంగా గాయలయ్యాయి. బాధితుడు కోలుకుంటున్నాడని, ప్రమాదం లేదని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. అలాగే ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement