విమానం పైకెక్కి వ్యక్తి హల్‌చల్‌

Man Climbs On Plane wing Moments Before Takeoff - Sakshi

అబూజా : టెకాఫ్‌కు రెఢీ అయిన విమానం రెక్కలపైకి ఎక్కి ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశారు. విమానం బయలుదేరే సమయంలో ఓ వ్యక్తి...విమాన రెక్కలపైకి ఎక్కటం చూసిన ప్రయాణీకులు నిర్ఘాంతపోయారు. కేకలు వేస్తూ భయంతో వణికిపోయారు. ఈ నెల 19న ఐకెజాలోని ముర్తాలా ముహమ్మద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ముర్తలా ముహమ్మద్ ఎయిర్‌పోర్ట్‌లో అజ్మన్ ఎయిర్ ఫ్లైట్ టేకాఫ్‌కు సిద్ధమైంది. ఇంతలో రన్ వే పక్కనే ఉన్న పొదల నుంచి ఓ వ్యక్తి అకస్మాత్తుగా విమానం వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అది గమనించిన పైలెట్ విమాన ఇంజన్ నిలిపివేశాడు. ఇంతలో విమానం పైకి ఎక్కిన ఆ దుండగుడు వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ను ఫ్లైట్ ఇంజన్ పైన పెట్టి విమానం రెక్కపైకి ఎక్కి నిలబడ్డాడు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రయాణీకులు భయపడిపోవడంతో వారందరినీ విమానం నుంచి దింపేశారు. తర్వాతి విమానంలో వారిని గమ్యస్థానాలకు చేర్చారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top