డబ్బు కోసమే నన్ను వాడుకున్నాడు!! | Lotto millionaire, dumps her boyfriend after showering him with expensive gifts which he sold | Sakshi
Sakshi News home page

డబ్బు కోసమే నన్ను వాడుకున్నాడు!!

Apr 28 2016 8:05 PM | Updated on Sep 3 2017 10:58 PM

డబ్బు కోసమే నన్ను వాడుకున్నాడు!!

డబ్బు కోసమే నన్ను వాడుకున్నాడు!!

మూడేళ్ల కిందటి వరకు ఆమె అందరిలా మామూలు అమ్మాయే.

మూడేళ్ల కిందటి వరకు ఆమె అందరిలా మామూలు అమ్మాయే. కానీ 17 ఏళ్ల వయస్సులో తనకు మిలియన్ పౌండ్ల (రూ. 9.68 కోట్ల) లాటరీ తగలడంతో ఓవర్‌నైట్ సంపన్నురాలిగా మారిపోయింది. తనకు దాచుకోలేనంత డబ్బు వచ్చాక మార్క్‌ స్కేల్స్‌ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. అతడితో ప్రేమలో పడింది. ప్రణయసల్లాపాల్లో మునిగిపోయింది. 'ట్రు లవ్‌' (నిజమైన ప్రేమ) తనకు దొరికిందని సంబురపడింది. అతనికి అడిగినంత డబ్బు ఇచ్చింది. బోలేడె కానుకలు ఇచ్చింది. అతడు తనపై ప్రేమతో కాకుండా, తన డబ్బుపై కన్నుతో తన వెంటపడ్డాడని తెలిసి ఇప్పుడు వాపోతున్నది ఇంగ్లండ్‌లోని ఎడిన్‌బర్గ్‌కు చెందిన జేన్‌ పార్క్‌ (20).

ఆమెకు అదృష్టం కలిసివచ్చి మూడేళ్ల కిందట హిబ్స్‌ ఫ్యాన్ మార్క్ లాటరీ తగిలింది.  లాటరీ తగలడంతోపాటు మార్క్‌ స్కేల్స్‌ అనే బాయ్‌ఫ్రెండ్‌ కూడా ఆమెను తగులుకున్నాడు. తన డబ్బుతో అతడు జల్సా చేసేవాడని, తనను కాకుండా తన డబ్బును మాత్రమే అతను ప్రేమించాడని ఆమె తాజాగా వాపోతున్నది. తాను ఎంతో ప్రేమగా ఇచ్చిన ఏడువేల పౌండ్ల రోలెక్స్ వాచ్‌ గిఫ్ట్‌ను మార్క్స్‌ అమ్మేశాడని, దీంతో అతని నిజస్వరూపం తెలిసి.. అతడ్ని విసిరికొట్టానని, తమ ప్రేమ పెటాకులైందని తాజాగా 'సన్‌' మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ లాటరీ మిలియనీర్‌ తెలిపింది.

తాను డబ్బుతో అతడి ప్రేమను కొనాలని భావించిన మాట వాస్తవమేనని, కానీ అతడు తనను ప్రేమించకుండా వాడుకోవడం మొదలుపెట్టాడని, అదే బాధ కలిగించిందని జేన్ పార్క్ చెప్పుకొచ్చింది. 'అతడు వట్టి పాములాంటి వాడు. మేం ఎప్పుడూ వాదించుకుంటూ ఉండేవాళ్లం. గత నెలలోనే అతన్ని వదిలించుకున్నా' అని జేన్‌ సన్‌ మ్యాగజీన్‌కు తెలిపింది. 'డబ్బు కోసమే నిన్ను వాడుకుంటున్నాడని నాకు అందరూ చెప్పారు. కానీ ఎవరి మాట వినలేదు. నేను ప్రేమలో ఉన్నట్టు భావించాను. గుడ్డిగా మసలుకున్నాను. డబ్బు కోసం తప్ప నన్ను ఏమాత్రం గౌరవించని ఇంతటి మూర్ఖుడిని ఎలా ప్రేమించానో తెలియడం లేదు. ఎంతో బాధగా ఉంది' అంటూ జేన్ పార్క్ ట్విట్టర్‌లో తెలిపింది. తన కారును అతనే వాడుకుంటున్నాడని, తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడని ఆమె పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement