కుక్కకు బదులుగా సింహం పిల్ల కాపలా!

Lion Used as Guard-Dog in Nigeria  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నైజీరియాలోని లాగోస్‌ నగరంలో రెండు అపార్టుమెంట్ల బ్లాక్‌ కలిగిన ఓ ఆసామీ భద్రత కోసం కుక్కకు బదులుగా సింహం పిల్లను తెచ్చి పెంచుతున్నారు. రెండేళ్ల వయస్సు కలిగిన ఆ సింహం పిల్లను కనీసం కట్టేయకుండా స్వేచ్ఛగా ఓ చెట్టు కింద వదిలేశారు. ఆ అపార్ట్‌ ఆవరణలో పిల్లల సంరక్షణ కేంద్రంతోపాటు ఓ ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. పిల్లలేమోగానీ పిల్లలను తీసుకొచ్చే పెద్దలు, తల్లిదండ్రులు ఆ సింహాన్ని చూసి జడుసుకు చస్తున్నారు.

అక్కడి నుంచి దాన్ని తొలగించాల్సిందిగా యజమానికి వారంతా కోరగా, అలవాటయితే అది కూడా కుక్కలాగానే మనిషులతోని మంచిగానే ఉంటుందని చెబుతూ వచ్చాడట. ఆ సింహం ప్రస్తుతానికి ఏమనకపోయినా ఏదో రోజు పిల్లలనో, తమనో పీక్కు తింటుందని ఆందోళన చెందిన అపార్ట్‌మెంట్‌ వాసులు నేరుగా పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దాంతో అటవి సిబ్బంది వచ్చి ఆ సింహం పిల్లకు మత్తుమందు ఇచ్చి లెక్కి ప్రాంతంలోని జంతు ప్రదర్శన శాలకు దాన్ని తరలించారు. ఈ విషయం తెల్సినప్పటి నుంచి గత రెండు రోజులగా ఆ యజమాని పత్తా లేకుండా పోయాడట. ఆయన ఆచూకి దొరికితే ఆయన్ని వన్య సంరక్షణ చట్టాల కింద అరెస్ట్‌ చేస్తామని అటవి శాఖ అధికారులు తెలిపారు. ఆ ఆసామీ పేరు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. రెండు నెలల క్రితమే ఆయన ఈ సింహం పిల్లను కొనుక్కొని వచ్చాడట.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top