చిక్కుల్లో మాజీ ప్రధాని | Libel complaint filed against Zia over remarks on PM's son | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో మాజీ ప్రధాని

May 15 2016 6:35 PM | Updated on Sep 4 2017 12:10 AM

చిక్కుల్లో మాజీ ప్రధాని

చిక్కుల్లో మాజీ ప్రధాని

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అధ్యక్షురాలు ఖలిదా జియా(70) మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు.

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అధ్యక్షురాలు ఖలిదా జియా(70) మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఆమెపై ఢాకా కోర్టులో పరువునష్టం దావా దాఖలైంది. ప్రధాని షేక్ హసినా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ పై చేసిన ఆరోపణలు చేసినందుకు ఈ దావా వేశారు.

ఈ నెల 1న ఢాకాలో జరిగిన ర్యాలీలో జియా ప్రసంగిస్తూ... వాజెద్ అక్రమంగా 300 మిలియన్ డాలర్లు బ్యాంకుల్లో దాచుకున్నారని ఆరోపించారు. జియా చేసిన ఆరోపణలు వాజెద్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ ప్రొ-అవామి లీగ్ జననేత్రి పరిషత్ అధ్యక్షుడు ఏబీ సిద్ధిఖీ ఢాకా కోర్టులో పరువునష్టం దావా వేశారు. పిటిషన్ ను స్వీకరించిన కోర్టు విచారణ జరపాలని పోలీసులను ఆదేశించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement