మెషిన్గన్లతో మహిళల గస్తీ | Lebanese Christian women armed with machine guns patrol their border village | Sakshi
Sakshi News home page

మెషిన్గన్లతో మహిళల గస్తీ

Jun 29 2016 10:38 AM | Updated on Sep 4 2017 3:43 AM

మెషిన్గన్లతో మహిళల గస్తీ

మెషిన్గన్లతో మహిళల గస్తీ

లెబనాన్లోని ఖా అనే గ్రామంలో ఇప్పుడు క్రిస్టియన్ మహిళలు మెషిన్ గన్లు చేత బట్టారు. వారికి అనుభవం లేకున్నా తలా ఓ గన్ పట్టుకొని గస్తీ కాస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా తమ తుపాకీ ఎక్కుపెడుతున్నారు.

లెబనాన్: లెబనాన్లోని ఖా అనే గ్రామంలో ఇప్పుడు క్రిస్టియన్ మహిళలు మెషిన్ గన్లు చేత బట్టారు. వారికి అనుభవం లేకున్నా తలా ఓ గన్ పట్టుకొని గస్తీ కాస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా తమ తుపాకీ ఎక్కుపెడుతున్నారు. అందుకు కారణం సోమవారం ఆ గ్రామంపై ఉగ్రవాదులు విరుచుకుపడటమే. ఖా అనే గ్రామం సిరియా సరిహద్దుకు కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఉంది. ఆ గ్రామం మొత్తం క్రిస్టియన్ జనాభాతో నిండి ఉంటుంది.

సోమవారం అనుమానిత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తొమ్మిది దాడులకు పాల్పడ్డారు. అందులో ఎనిమిది ఆత్మాహుతి దాడులే. ఇందులో ఐదుగురు చనిపోగా 30మందికి పైగా గాయాలపాలయ్యారు. దీంతో ఒక్కసారిగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ గ్రామం ఉలిక్కిపడింది. ఓ పక్క లెబనాన్ మిలటరీ మొత్తం ఆ గ్రామంలో దిగినప్పటికీ తాము కూడా సిద్ధం అంటూ అక్కడి క్రిస్టియన్ మహిళలు మెషిన్ గన్లు పెట్టారు. ఆగ్రామం చుట్టుముట్టి అందులోకి అక్రమంగా చొరబడిన 103మంది సిరియాకు చెందిన శరణార్ధులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement