కిలోగ్రామ్‌కు సరికొత్త నిర్వచనం

Kilogram, ampere, kelvin and mole redefined - Sakshi

వర్సెయిల్స్‌: ప్రపంచవ్యాప్తంగా బరువును కొలిచేందుకు వాడుతున్న కిలోగ్రామ్‌(కేజీ) ప్రమాణం నిర్వచనాన్ని మార్చేందుకు ఫ్రాన్స్‌ లో సమావేశమైన 50 దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. దీంతో పాటు విద్యుత్‌ ప్రవాహానికి వాడే ఆంపియర్, ఉష్ణోగ్రతకు వాడే కెల్విన్, పదార్థ రాశిని కొలిచేందుకు వాడే మోల్‌ ప్రమాణాల నిర్వచనాలను సవరించాలని నిర్ణయించాయి. ఫ్రాన్స్‌లోని వర్సయిల్స్‌లో జరిగిన ఓ సమావేశంలో ఈ నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు.

1889 నుంచి ఇప్పటివరకూ ఫ్రాన్స్‌లోని ఓ హైసెక్యూరిటీ లాకర్‌లో భద్రపరిచిన ప్లాటినం–ఇరీడియం అల్లాయ్‌ గోళాన్ని ఇన్నాళ్లూ కేజీకి ప్రమాణంగా పరిగణిస్తూ వచ్చారు. ఈ లోహపు వస్తువు కిందపడ్డా, మరే కారణంచేత అయినా దెబ్బతిన్నా కేజీ బరువులో మార్పులు జరిగే అవకాశముండేది. ఈ నేపథ్యంలో తాజా నిర్వచనం ప్రకారం కేజీని ఇకపై ప్రజలకు అనుకూలంగా ఉండేలా డిజిటల్‌ మాధ్యమంలో సంఖ్యల రూపంలో తెలియజేయనున్నారు. ఈ నిర్ణయం కారణంగా ప్రజల జీవితాల్లో పెద్దగా వచ్చే మార్పేమీ ఉండబోదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వచ్చే మే 20 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top