మాట తప్పిన జస్టిన్ బీబర్ | Justin Bieber caught smoking again | Sakshi
Sakshi News home page

మాట తప్పిన జస్టిన్ బీబర్

Jan 12 2016 10:56 AM | Updated on Sep 3 2017 3:33 PM

మాట తప్పిన జస్టిన్ బీబర్

మాట తప్పిన జస్టిన్ బీబర్

పాప్ సంగీత సంచలనం జస్టిన్ బీబర్ పొగతాగుతూ కెమెరాకు చిక్కాడు. జనవరి 9న సాయంకాలం ఓ హోటల్ బయట సిగరెట్ కాలుస్తూ దొరికి పోయాడు.

లాస్ ఏంజెలెస్: పాప్ సంగీత సంచలనం జస్టిన్ బీబర్ పొగతాగుతూ కెమెరాకు చిక్కాడు. జనవరి 9న సాయంకాలం ఓ హోటల్ బయట సిగరెట్ కాలుస్తూ దొరికి పోయాడు. కొత్త సంవత్సరంలో స్మోకింగ్ మానేయాలని నిర్ణయించుకున్నానని చెప్పిన కొద్ది రోజులకే అతడు పొగతాగుతూ కనబడడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు.

ధూమపానం మానేస్తున్నట్టు 'ది బెర్త్ షో' సందర్భంగా బీబర్ చెప్పాడు. 'ఇక నుంచి స్మోకింగ్ వదిలేస్తున్నా. ధూమపానం ఆరోగ్యానికి మంచిది కాదు. పొగ తాగే అలవాటున్న వారిని చెడ్డవారంటారు. అలా అనిపించుకోవాలనుకోవడం నాకు ఇష్టం లేద'ని బీబర్ పేర్కొన్నాడు.

ఇలా ప్రకటించిన వారం రోజులకే మళ్లీ చేతిలో సిగరెట్ తో కలిపించాడీ హిట్ మేకర్. తాను నివసిస్తున్న హోటల్ బయటే పొగతాగుతూ కనిపించాడు. అయితే బీబర్ స్మోక్ చేయలేదని హోటల్ సిబ్బందిలో ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement