డెమొక్రాటిక్‌ అభ్యర్థిగా జో బిడెన్‌

Joe Biden Formally Clinches Democratic Presidential Nomination - Sakshi

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ తరపున జో బిడెన్ అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారయ్యింది. అధ్యక్ష పోటీకి అవసరమైన 1993 మంది ప్రతినిధులు మద్దతు బిడెన్‌కు లభించింది. అలాగే, అదే పార్టీకి చెందిన బెర్ని శాండర్స్ సైతం ఏప్రిల్‌లో పోటీ నుంచి తప్పుకోవడంతో బిడెన్‌కు మార్గం సుగమం అయ్యింది. దీంతో డెమొక్రట్ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌తో మాజీ ఉపాధ్యక్షుడు బిడెన్ నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తలపడనున్నారు.(నిరుద్యోగరేటుకు ఫ్లాయిడ్‌కు ముడి.. ట్రంప్‌పై ఆగ్రహం)

‌77 ఏళ్ల బిడెన్ 36 ఏళ్ల నుంచి సెనేటర్‌గా కొనసాగుతున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి మూడోసారి ప్రయత్నించి విజయం సాధించారు. గతంలో రెండుసార్లు పోటీపడినా డెమొక్రాట్ల మద్దతు పొందలేకపోయారు. బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బిడెన్‌ 2009 నుంచి 2017 వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. త్వరలో జో బిడెన్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రతినిధులు తనకు మద్దతు ఇవ్వడంపై  జో బిడెన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు.

‘అధ్యక్ష పదవి కోసం జరిగే యుద్ధంలో విజయం సాధించడానికి దేశవ్యాప్తంగా ఉన్న అమెరికన్ల ఓట్లను సంపాదించడానికి ఇక రోజూ ప్రయత్నిస్తా. ఇప్పుడు మనకు గౌరవం తెచ్చే ఉద్యోగాలు కావాలి.ప్రతి అమెరికన్‌కు సమన్యాయం జరగాలి. కరోనా నేపథ్యంలో కుంచించుకుపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.. వారి అవసరాలు తీర్చి, సహాయపడే ఒక అధ్యక్షుడు కావాలి’ అని పేర్కొన్నారు. దేశం గతంలో ఎన్నడూ చూడని నిరుద్యోగాన్ని చవి చూస్తోందని,1960 తర్వాత అంతటి స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ట్రంప్‌పై పరోక్షంగా విమర్శించారు. (కరోనాతో దావూద్‌ ఇబ్రహీం మృతి..!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top