నగ్న ఫోటోల లీకేజీ వివాదంలో ప్రపంచ కుబేరుడు | Jeff Bezos Face Defamation Case | Sakshi
Sakshi News home page

ప్రపంచ కుబేరుడిపై పరువునష్టం దావా

Feb 2 2020 9:05 PM | Updated on Feb 2 2020 9:05 PM

Jeff Bezos Face Defamation Case - Sakshi

వాషింగ్టన్‌ : ప్రపంచ అపర కుబేరుడు, అమెజాన్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి జెఫ్ బెజోస్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయన గర్ల్ ఫ్రెండ్ లారెన్ శాంచెజ్ సోదరుడు మైకెల్ శాంచెజ్... జెఫ్ బెజోస్‌పై పరువునష్టం దావా వేశారు. తన సోదరికి చెందిన నగ్న ఫొటోల లీకేజీ వెనక జెఫ్ బెజోస్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించి ఓ సంస్థకు ఆయన ఇచ్చిన... కొన్ని ఫొటోలను ఆధారాలుగా చూపించారు. ఈ క్రమంలో శనివారం రాత్రి... లాస్ ఏంజెల్స్‌లోని కౌంటీ సుపీరియర్ కోర్టులో పరువునష్టం దావా వేశారు.

ఐతే... బెజోస్ తరపున పనిచేస్తున్న సెక్యూరిటీ కన్సల్టెంట్ గావిన్ డి బెకెర్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. మైకెల్ శాంచెజ్.. ఆధారాలుగా సమర్పించిన ఫొటోల్లో ఉన్నది జెఫ్ బెజోస్ కాదనీ.. అవి గ్రాఫిక్ న్యూడ్ ఫొటోలని ఆయన అంటున్నారు. దీనిపై త్వరలోనే బెజోస్ కోర్టుకు వివరణ ఇస్తారని ఆయన తరపు లాయర్ విలియం తెలిపారు. కాగా జనవరిలో జెఫ్ బెజోస్‌కి చెందిన కొన్ని వ్యక్తిగత వివరాలను ఓ మీడియాసంస్థ బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement