బెజోస్, సాంచెజ్‌ సన్నిహిత ఫొటోలు

Jeff Bezos and Lauren Sanchez Public Display Of Affection - Sakshi

న్యూఢిల్లీ : ఒకరికొకరు ఆప్యాయ ఆలింగంలో తన్మయులవుతున్న ఈ జంట ఫొటో సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. వారిలో అమెజాన్‌ ఈ కామర్స్‌ సంస్థ సీఈవో జెఫ్‌ బెజోస్‌ ఒకరు కాగా, మరొకరు ఆయన గర్ల్‌ ఫ్రెండ్‌ లారెన్‌ సాంచెజ్‌. 55 ఏళ్ల జెఫ్‌ బెజోస్, మీడియా దిగ్గజం బెర్రీ డిల్లర్‌ భార్య లారెన్‌ సాంచెజ్‌ (49) గత కొన్ని రోజులుగా సన్నిహితంగా తిరుగుతున్నారు. ఏడు కోట్ల డాలర్లు ఖరీదు చేసే తన భర్త ‘యాట్‌ ( విలాసవంతమైన మర పడవ)’లో లారెన్‌ సాంచెజ్, జెఫ్‌ బెజోస్‌ గురువారం సాయంత్రం ఇలా కెమెరాకు దొరికిపోయారు. అతిథుల కోసం నిరీక్షిస్తున్న వారు దొరికిన ఏకాంత క్షణాలను ఇలా వినియోగించుకున్నారు. లేత నీలి రంగు టీషర్టు ధరించిన లారెన్‌ భర్త బెర్రీ డిల్లర్‌ వచ్చి ఆ తర్వాత వారితో కలిశారు. జెఫ్, లారెన్‌ మధ్య ఉన్న బంధం ఎలాంటిదో తెలియదుగానీ వారి మధ్య సన్నిహిత సంబంధాలు కచ్చితంగా ఉండి ఉంటాయని ఫొటోను చూసిన నెటిజన్లు అనుమానిస్తున్నారు.

అలెక్సా (మాటలను గుర్తుపట్టి అందుకు అనువుగా స్పందించి ఇంటర్నెట్‌ నుంచి మనకు కావాల్సిన సమాచారాన్ని, పాటలను అందించే పరికరం)లను తయారు చేస్తున్న అమెజాన్‌ యూనిట్‌లో పిల్లలో వెట్టి చేయిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో జెఫ్‌ ఫొటో జనాలను ఇలా ఆకర్షిస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top