హాలీవుడ్ తరహా నటన, మ్యూజిక్ లతో కూడిన వీడియోలతో యువతను ఆకట్టుకునేందుకు ఐఎస్ఐఎస్ కొత్త తరహా ప్రయత్నాలు చేస్తోంది.
లండన్ః యువతను ర్యాప్ మ్యూజిక్ ఆకట్టుకుంటుదన్న దృష్టిలో ఇస్లామిక్ స్టేట్ కొత్త వ్యూహాలు పన్నుతోంది. హాలీవుడ్ స్టైల్ మ్యూజిక్ వీడియోలతో ప్రాపగాండ ప్రారంభించింది. మిలిటెంట్ గ్రూప్ లో వ్యక్తులను చేర్చుకునేందుకు వినూత్న ప్రయత్నం చేస్తోంది.
హాలీవుడ్ తరహా నటన, మ్యూజిక్ లతో కూడిన వీడియోలతో యువతను ఆకట్టుకునేందుకు ఐఎస్ఐఎస్ కొత్త తరహా ప్రయత్నాలు చేస్తోంది. ఉగ్రవాద సంస్థలో సభ్యులను చేర్చుకునేందుకు ప్రత్యేక ఎడిటింగ్, ర్యాప్ మ్యూజిక్ తో కూడిన వీడియోలను ప్రయోగిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. సుమారు 80 శాతం మంది ఫ్రెంచ్ మాట్లాడే ఐఎస్ టెర్రరిస్టుల్లో 'సూపర్ జిహాదీ' పేరిట ఫ్రాన్స్ నుంచి విడుదలైన హాలీవుడ్ స్టైల్ వీడియోలకు ఆకర్షితులైన వారేనని ఫ్రెంచ్ అధికారులు చెప్తున్నారు.
ఫ్రాన్స్ లో పుట్టి పెరిగి 2013లో సిరియా కు తరలివెళ్ళిన 41 ఏళ్ళ ఓమ్ సేన్ అలియాస్ ఒమర్ డైబీని ఇప్పుడు అతని అనుచరులు ఓ ఆధ్యాత్మిక నాయకుడుగా చూస్తారు. ఫ్రెంచ్ జిహాదీ బృందానికి నాయకుడుగా ఉంటున్నఅతడు.. 2015 లో వ్యంగ్య పత్రిక ఛార్లీ హెబ్డో కార్యాలయం దాడులపై ఓ చిత్రాన్ని కూడా నిర్మించాడు. పాప్ సంస్కృతిని వినియోగించుకొని ర్యాప్ సంగీతం తో వీడియోలు అభివృద్ధి పరిచే చరిత్ర తీవ్రవాదులకు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఏప్రిల్ నెలలో ఐస్ అనుకూల గ్రూప్.. అల్-వాద్ మీడియా ప్రొడక్షన్ ఓ వీడియోను రూపొందించి నివేదించింది. ఈఫిల్ టవర్ పై 'కాల్ ఆఫ్ డ్యూటీ' వీడియో గేమ్ నుంచి సేకరించిన గ్రాఫిక్స్ తో ఆకట్టుకునే విధంగా వీడియోను అభివృద్ధి పరిచింది. ఇటువంటి వీడియోలకు ఆకర్షితులై.. ఇప్పటికే ఓమ్ సేన్ సహా కనీసం 1700 మంది ఫ్రెంచ్ పౌరులు ఐఎస్ పోరాటంకోసం దేశాన్ని వదిలి వెళ్ళినట్లు తెలుస్తోంది.