ఆ విమానాన్ని కూల్చేసింది మేమే | Islamic State group in Egypt claims it downed Russian passenger jet in Sinai | Sakshi
Sakshi News home page

ఆ విమానాన్ని కూల్చేసింది మేమే

Oct 31 2015 7:59 PM | Updated on Sep 3 2017 11:47 AM

ఆ విమానాన్ని కూల్చేసింది మేమే

ఆ విమానాన్ని కూల్చేసింది మేమే

రష్యా విమాన ప్రమాదంలో మరో మలుపు. ముందుగా ఊహిస్తూ వస్తున్నట్లే విమానాన్ని కూల్చింది తామేనంటూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు.

- రష్యా విమాన దుర్ఘటనపై ఐఎస్ ప్రకటన

కైరో: రష్యా విమాన ప్రమాదంలో మరో మలుపు. ముందుగా ఊహిస్తూ వస్తున్నట్లే విమానాన్ని కూల్చింది తామేనంటూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. సినాయి ద్వీపకల్పంలో శనివారం విమానాన్ని కూల్చింది తామేనంటూ ఐఎస్ ప్రకటించుకున్నదని ఏఎఫ్ పీ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఈజిప్ట్ అధికారులు మాత్రం విమానం కూల్చివేతను కొట్టిపారేస్తున్నారు.

 

సాంకేతిక లోపం తలెత్తడంవల్లే విమానం కూలిందని స్పష్టం చేస్తున్నారు. ఈ ఇరువురి పరస్పర విరుద్ధ ప్రకటన నడుమ రష్యా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుంటేగానీ అసలు విషయం తేలేలాలేదు. సిరియాలో జరుగుతున్న అంత్యర్యుద్ధంలో అధ్యక్షుడు అల్ బషీర్ కు అండగా సైన్యాన్ని పంపినందుకు ప్రతీకారంగానే రష్యా విమానంపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement