ఎన్నికలు ముగిసేదాకా జైల్లోనే షరీఫ్‌

Islamabad HC rejects Nawaz Sharif, Maryam's bail pleas - Sakshi

ఇస్లామాబాద్‌: అవెన్‌ఫీల్డ్‌ అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్, ఆయన కుమార్తె మరియమ్, అల్లుడు మహ్మద్‌ సఫ్దర్‌లకు ఇస్లామాబాద్‌ హైకోర్టు షాకిచ్చింది. బెయిల్‌ మంజూరు చేయాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను జూలై చివరి వారానికి కోర్టు వాయిదా వేసింది. అలాగే తమకు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించింది.

అప్పీలు పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకు ఈ పిటిషన్లపై విచారణ చేపట్టలేమని తెలిపింది. అనంతరం కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందుంచాల్సిందిగా నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరోకు నోటీసులు జారీ చేసింది. బెయిల్‌పై విడుదలై రానున్న ఎన్నికల(25వ తేదీ)కు తమ పార్టీ (పీఎంఎల్‌–ఎన్‌) తరఫున ప్రచారం చేయాలనుకున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. అక్రమాస్తుల కేసులో నవాజ్‌ షరీఫ్‌కు పదేళ్ల జైలు, ఆయన కుమార్తె మరియమ్‌కు 7 ఏళ్ల జైలు, అల్లుడు సఫ్దర్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top