
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాజీ ప్రధానమంత్రి థక్సిన్ షినవత్రా(Thaksin Shinawatra)కు అధికార దుర్వినియోగం తదితర పాత కేసుల్లో ఏడాది జైలు శిక్ష పడింది. పదేళ్ల అజ్ఞాతం అనంతరం 2023లో ఆయన స్వదేశానికి తిరిగొచ్చాక అధికారులు ఆయన కేసును తప్పుగా అన్వయించుకున్నారా అన్న ఆరోపణలపై దర్యాప్తు జరిపిన కోర్టు ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది. థక్సిన్‌కు విధించిన శిక్షను సరిగ్గా అమలు చేయలేదని, పోలీస్ ఆస్పత్రిలో ఆయన నిర్బంధంలో ఉన్న కాలాన్ని జైలు శిక్షగా పరిగణించలేమని పేర్కొంది.
2023లో స్వదేశానికి చేరుకున్న షినవత్రా సగం రోజు మాత్రమే జైలులో ఉన్నారు. అనంతరం ఆయన్ను అనారోగ్య కా రణాలతో అన్ని వసతులుండే పోలీస్ ఆస్పత్రికి తీసు కెళ్లారు. అయితే, ఆయన అనారోగ్యం అంత తీవ్రమైంది కాదని, జైలు ఆస్పత్రిలోనే చికిత్స చేయవచ్చని తా జాగా సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయస్థానానికి షినవత్ర కుమారుడు పింటొంగ్‌టా, కుమార్తె, మాజీ ప్రధాని పెటొంగ్‌టర్న్‌తో కలిసి వచ్చారు.
అనంతరం ఆయన్ను అధికారులు జైలుకు తీసుకెళ్లారు. 2001లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన థక్సిన్ 2006లో సైనిక తిరుగుబాటు జరిగే వరకు పదవిలో కొనసాగారు. అనంతరం విదేశాలకు వెళ్లిపోయారు. అప్పుడే పలు ఆరోపణలువచ్చాయి. 2008లో తిరిగొచ్చినా మళ్లీ వెంటనే దేశం విడిచారు. రాచ కుటుంబాన్ని విమర్శించిన కేసు నుంచి ఆయనకు గత నెలలో విముక్తి కలిగింది.