ఉగ్రవాదులూ..యూరప్‌ వెళ్లొద్దు: ఐసిస్‌

ISIS Tells Its Terrorists Not To Travel To Coronavirus-Affected Europe - Sakshi

లండన్‌: యూరప్‌లో దాడులు జరపాలంటూ తన శ్రేణులను పురిగొల్పే ఉగ్రసంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐసిస్‌) కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి మాట మార్చింది. కోవిడ్‌తో సతమతమవుతున్న యూరప్‌ దేశాలకు ప్రయాణాలను మానుకోవాలని ఐసిస్‌ తన శ్రేణులను కోరింది. ఈ మేరకు తన పత్రిక ‘అల్‌ నబా’లో ఐసిస్‌ పలు ఆదేశాలిచ్చిందని ‘సండే టైమ్స్‌’ పేర్కొంది. ‘అంటువ్యాధుల భూమి యూరప్‌’ వైపు ఆరోగ్యవంతులు వెళ్లరాదు. ఇప్పటికే వ్యాధికి గురైన వారు, ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు సొంత ప్రదేశం విడిచి బయటకు వెళ్లవద్దు. ముక్కు చీదేటప్పుడు, ఆవులించే సమయంలో నోటికి గుడ్డను, చేతిని అడ్డుపెట్టుకోవాలి. క్రమం తప్పక చేతులు కడుక్కోవాలి’ అని సూచించింది. కోవిడ్‌ను మహమ్మారిగా పేర్కొన్న ఐసిస్‌.. ‘ఎవరిని హింసించాలని దేవుడు అనుకున్నాడో అక్కడికే దీనిని పంపాడు’ అని పేర్కొంది. (కరోనా టీకా; అమెరికా కుయుక్తులు!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top