'బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లకు మాదే బాధ్యత' | ISIS claims response for Brussels explosions | Sakshi
Sakshi News home page

'బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లకు మాదే బాధ్యత'

Mar 22 2016 6:01 PM | Updated on Sep 3 2017 8:20 PM

'బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లకు మాదే బాధ్యత'

'బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లకు మాదే బాధ్యత'

బెల్జియం రాజధానిలో బ్రస్సెల్స్లో బాంబు పేలుళ్ల ఘటనకు తమదే బాధ్యతని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

బ్రెస్సెల్స్: బెల్జియం రాజధానిలో బ్రస్సెల్స్లో బాంబు పేలుళ్ల ఘటనకు తమదే బాధ్యతని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. మంగళవారం బ్రస్సెల్స్లోని జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ వద్ద రెండు చోట్ల, పక్కనే రైల్వే స్టేషన్ సమీపంలో మరో పేలుడు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం 30 మంది మరణించగా, మరో 35 మంది గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, ప్యారిస్ లో బాంబుదాడులకు పాల్పడిన  సలాహ్ అబ్దెస్లామ్ను అరెస్టు చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

బాంబు పేలుళ్ల ఘటన అనంతరం తాత్కాలికంగా విమానాశ్రయాన్ని మూసివేశారు. నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు. పోలీసులు నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులను అరెస్ట్ చేశారు. బెల్జియం, ఫ్రాన్స్ సరిహద్దును మూసివేసి ఉగ్రవాదుల కోసం భద్రత బలగాలు వేటాడుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement