ఆ పక్షులు.. ఇక కానరావట..! | Sakshi
Sakshi News home page

ఆ పక్షులు.. ఇక కానరావట..!

Published Sun, Nov 13 2016 10:47 AM

ఆ పక్షులు.. ఇక కానరావట..!

ప్రపంచంలో అంతరించిపోయే దశకు చేరుకున్న పక్షి జాతులు సుమారు 210 ఉన్నాయంట! నమ్మడానికి కాస్తా ఇబ్బందిగా ఉన్న ఇది పచ్చి నిజం. రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీ ద్వారా పక్షుల ఉనికి , వాటి నివాస స్థావరాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలో సుమారు 210 పక్షి జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అనూహ్య మార్పుల వల్ల పక్షుల ఉనికి కోల్పోవాల్సి వస్తోందని తెలిపారు. అంతేకాకుండా ఆ 600 జాతుల్లో 189 జాతులను తిరిగి వర్గీకరించాలని వారు సూచించారు.

కానీ వాటిలో ఏ ఒక్క పక్షి కూడా ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) ఇప్పటివరకు గుర్తించకపోవడం గమనార్హం. ఈ మేరకు డ్యూక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 600 పక్షి జాతులు ఉండగా అందులో 108 అంతరించేపోయే దశకు చేరుకున్నట్లు ఐయూసీఎన్‌ వెల్లడించింది. కానీ ప్రస్తుత పరిశోధనల ప్రకారం 210 రకాల జాతుల ఉనికి ప్రమాదంలో ఉన్నట్లు కనుగొన్నారు.

Advertisement
Advertisement