పిరికిపందల్లా పారిపోయేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో ఏడుగురికి ఐఎస్ మరణదండన విధించింది.
బాగ్దాద్: యుద్ధ రంగం నుంచి పిరికిపందల్లా పారిపోయేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో ఏడుగురికి ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) మరణదండన విధించింది. తమ కీలక స్థావరం నుంచి మోసూల్ నగరం నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించినందుకు వీరికి మరణశిక్ష అమలుచేసినట్టు స్థానిక వెబ్ సైట్ 'అరా న్యూస్' వెల్లడించింది.
'ఈ ఏడుగురు సిరియా సరిహద్దులో ఆదివారం పట్టుబడ్డారు. అధినాయకత్వం అనుమతి లేకుండా తమ పదవులను వదిలిపెట్టారు. మొసూల్ నగరం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. జాతిద్రోహానికి పాల్పడినందుకు వీరిని కాల్చిచంపార'ని మీడియా కార్యకర్త అబ్దుల్లా ఆల్-మల్లా వెల్లంచినట్టు 'అరా న్యూస్' తెలిపింది.
మోసుల్ నగరాన్ని దక్కించుకునేందుకు అమెరికా సైనం సహకారంలో ఇరాక్ ఆపరేషన్ మొదలుపెట్టడంతో ఐసిస్ తీవ్రంగా పోరాడుతోంది. మోసుల్ నగరాన్ని 2014లో ఐసిస్ స్వాధీనం చేసుకుని తమ రాజధానిగా ప్రకటించుకుంది.