చాబహర్‌ రైల్వే లైన్‌ నిర్మాణ వివాదం.. ఇరాన్‌ స్పందన

Iran Clarifies No Deal With India On Chabahar Railway Project - Sakshi

టెహ్రాన్‌: చాబహర్‌ పోర్టు నుంచి జహెదాన్‌ వరకు చేపట్టిన రైల్వే లైన్ నిర్మాణం నుంచి భారత్‌ను తొలగించినట్లు గత కొన్ని రోజులుగా వస్తోన్న వార్తలను ఇరాన్‌ ఖండించింది. ఈ మేరకు ఇరాన్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్‌ సహాయకులలో ఒకరైన ఫర్హాద్ మోంటాజర్ ఒక ప్రకటిన విడుదల చేశారు. ‘ఈ వార్తలు పూర్తిగా అబద్ధం. ఎందుకంటే చాబహర్-జహెదాన్ రైల్వేలైన్‌ నిర్మాణానికి సంబంధించి ఇరాన్, భారతదేశంతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. చాబహర్‌కు సంబంధించి ఇరాన్,‌ భారతదేశంతో కేవలం రెండు ఒప్పందాలు మాత్రమే కుదుర్చుకుంది. ఒకటి ఓడరేవు యంత్రాలు, ఇతర పరికరాలకు సంబంధించినది. రెండవది భారతదేశం ఈ ప్రాజెక్ట్‌లో 150 మిలియన్ డాలర్ల పెట్టుబడికి సంబంధించినది మాత్రమే’ అని ప్రకటనలో తెలిపింది. చాబహర్లో ఇరాన్-ఇండియా సహకారానికి, అమెరికా ఆంక్షలకు ఎటువంటి సంబంధం లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది.

2012లో ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్-ప్రొలిఫరేషన్ యాక్ట్ (ఐఎఫ్‌సిఎ) కింద చాబహర్ ఓడరేవు ప్రాజెక్టులపై మాఫీకి అమెరికా 2018లో అంగీకరించింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వ రంగ రైల్వే సంస్థ ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఈ ప్రాజెక్టుకు అన్ని సేవలు, నిధులను అందిస్తామని హామీ ఇచ్చింది. ఇది సుమారు 1.6 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచాన. ఈ ప్రాజెక్ట్‌ ‘ఇరాన్ ఆర్ధిక భవిష్యత్తును నిర్మించడంలో కీలకమైన భాగం’ అని అధ్యక్షుడు హసన్ రౌహానీ  అభివర్ణించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top