టిక్‌టాక్‌కు పోటీగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కొత్త టూల్‌..!

Instagram Is Testing A New Video Editing Tool That Copies TikTok Best Features - Sakshi

టిక్‌టాక్‌.. ఇప్పుడు ఎవరికి అడిగినా ఈ యాప్‌ గురించి టకీమని చెప్పేస్తారు. ఈ యాప్‌ గురించి తెలియనివారు ఉండరేమో అంటే అతియోశక్తికాదు. ప్రస్తుతం నెటిజన్లకు అందుబాటులో ఉన్న అనేక సోషల్ మీడియా యాప్‌లలో టిక్‌టాక్‌కు ఎంత ఆదరణ లభిస్తుందో అందరికీ తెలిసిందే. చిన్న పిల్లలు మొదలు.. పండు ముసలి సైతం ఈ యాప్‌ ద్వారా వీడియోలు చేసి తమను తాము బాహ్య ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నారు. ఒకప్పుడు వాట్సాప్, ఫేస్‌బుక్‌లను ఎక్కువగా వాడేవారు. అయితే ఇప్పుడు అందరి నోటా టిక్‌టాక్ మాటే వినిపిస్తోంది. ఎవర్ని చూసినా టిక్‌టాక్ యాప్‌లో వీడియోలు చేస్తూ కనిపిస్తున్నారు. ఇక కొందరైతే ఈ యాప్ ద్వారానే సెలబ్రిటీలుగా మారిపోయిన విషయం కూడా విదితమే.

 అయితే టిక్‌టాక్ నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్ట్రాగ్రామ్‌ కూడా త్వరలోనే టిక్‌టాక్‌ను పోలిన ఓ కొత్త టూల్‌ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిసింది. టిక్‌టాక్ యాప్‌కు లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఇన్‌స్ట్రాగ్రామ్‌ కూడా సరిగ్గా అలాంటి ఫీచర్స్‌ ఉన్న ఓ టూల్‌ను ప్రస్తుతం డెవలప్ చేసింది. దాని పేరు సీన్స్‌‌.

సీన్స్‌టూల్‌ను ప్రయోగాత్మకంగా బ్రెజిల్‌లో వినియోగించారు. అక్కడ సక్సెస్‌పుల్‌గా కొనసాగుతుంది. టిక్‌టాక్‌ మాదిరి సీన్స్‌లో కూడా 15 సెంకడ్ల నిడివి గల వీడియోను అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన మ్యూజిక్‌ని సెట్‌ చేసుకోవచ్చు. వీడియోను షేర్‌ చేసుకునే ఆప్షన్‌తో పాటు డ్యూయెట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే ఈ టూల్‌ కేవలం ఒక బ్రెజిల్‌లోనే అమలవుతుందా లేదా ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి వస్తుందా తెలియదు. కానీ ఆచరణ మాత్రం సాధ్యమే. మరి ఇన్‌స్ట్రాగ్రామ్‌ తెచ్చే ఆ నూతన టూల్‌ ఎప్పుడు యూజర్లకు లభిస్తుందో, అది ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top